Categories: LATEST UPDATES

న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షో షురూ!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తీసుకుంటున్న విప్ల‌వాత్మ‌క, వినూత్న నిర్ణ‌యాల వ‌ల్ల హైద‌రాబాద్‌లో రియ‌ల్ రంగం అభివృద్ధి చెందుతోంద‌ని చీఫ్ విప్ టి.భానుప్ర‌సాద్ రావు తెలిపారు. ఆయ‌న న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. మౌలిక స‌దుపాయ‌ల అభివృద్ధి, మెరుగైన శాంతిభ‌ద్ర‌త‌లు వంటి అనేక అంశాల వ‌ల్ల నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. న‌రెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ బి. సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన కనెక్టివిటీతో, నగరం చుట్టూ ఉన్న సబ్‌మార్కెట్లు అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకు మించిన మంచి సమయం మరొకటి ఉండద‌ని అన్నారు. సెక్రటరీ జనరల్ విజయ సాయి మేకా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వ ప్రగతిశీల కార్యక్రమాలకు కూడా చురుకుగా సహకరిస్తున్నాం. అన్ని ప్రాపర్టీలు మీ పెట్టుబడి ఎంపికలలో పారదర్శకత, విశ్వసనీయతకు హామీ ఇస్తూ రెరా ధృవీకరణను పొందిన విషయం కూడా గమనించాలి’ని అన్నారు. న‌రెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, కోశాధికారి కాళీ ప్రసాద్ దామెర ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్ర‌ద‌ర్శ‌న‌కు 300 ప్రాప‌ర్టీలు

ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, విమానయాన రంగం, వాహనరంగం, ఇతర కీలక రంగాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త సంస్కరణలు, విధానాలు హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. తద్వారా ఈ నగరం ప్రపంచ బహుళజాతి కంపెనీలకు అత్యంత ప్రముఖ గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. గత త్రైమాసికాలతో పోల్చినప్పుడు టెక్ ఉపాధి బలమైన వృద్ధి ఇళ్ల డిమాండ్‌లో ఆరోగ్యకరమైన జోరుకు దారి తీస్తోంది. కొనుగోలుదారులు తమ ప్రాధాన్యతలు, బడ్జెట్‌కు అనుగుణంగా 300 ప్రాపర్టీల ను ఎంచుకునే అవకాశ‌ముంది. డెవలపర్లు వివిధ తరగతుల కస్టమర్లకు సరిపోయేలా అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వ్యవసాయ భూములతో కూడిన అనేక రకాల ప్రాపర్టీలను అందిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ హోమ్ లోన్స్ వంటి బ్యాంకులు తమ ఇంటి రుణాల ఉత్పాదనలను ఆఫర్ చేస్తున్నాయి.

This website uses cookies.