poulomi avante poulomi avante

భూభార‌తి, బిల్డ్ నౌ ల‌ను ప్ర‌వేశ‌పెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నరెడ్కో తెలంగాణ

ప్రభుత్వం చేపట్టిన భూభారతి, బిల్డ్‌నౌ అప్లికేషన్‌ను నరెడ్కో తెలంగాణ బ‌లంగా స‌మ‌ర్థిస్తోంది. ఈ రెండింటినీ సమర్థంగా అమలు చేయగలదని, ఇందులో భాగంగా సంబంధిత వాటాదారులతో నిరంతర చర్చలకు ముందుకు వస్తుందని నరెడ్కో తెలంగాణ విశ్వసిస్తోంది. వీటిని అమ‌లు చేస్తున్నందుకు నరెడ్కో తెలంగాణ సంస్థ ప్రభుత్వానికి ధన్యవాదాల్ని తెలియజేసింది. ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధిలో, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇవి కృషి చేస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డింది. భూమి రికార్డులకు మరింత స్పష్టత, పారదర్శకత, విశ్వసనీయతను అందించేందుకు భూభార‌తిని రూపొందించార‌ని కొనియాడింది. గతంలో ధరణి పోర్టల్ కు ఇది పునర్నిర్మితమైన, మరింత ప్రభావంతమైన రూపమ‌ని అభిప్రాయ‌ప‌డింది. సరళీకృత‌మైన ప్ర‌క్రియ‌ల ద్వారా ఇది గ‌త స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని.. చట్టపరమైన తప్పిదాలను సవరించేందుకు వీలు క‌ల్పిస్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేసింది. భూమి యాజమాన్య రికార్డులపై ప్రజల్లో విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంద‌ని.. ఆధునికీకరించిన రికార్డ్ ఆఫ్ రైట్ (ఆర్ఓఆర్) విధానం అనేది భూభారతిలో కీలకంగా ఉంటుంద‌ని పేర్కొంది. చట్టపరమైన రిస్క్ లను తగ్గించేందుకు మరియు భద్రమైన, అవగాహనతో కూడిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఇది డెవలపర్లకు ఎంతో అవసరంమ‌ని తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయ సాయి మేకా మాట్లాడుతూ, ‘‘తెలంగాణలో పారదర్శక మైన, సమర్థవంతమైన భూపాలనా వ్యవస్థ దిశలో భూభారతి కార్యక్రమం ఒక పెద్ద ముందడుగు. దాంతో పాటుగా బిల్డ్ నౌ అప్లికేషన్ కూడా భవనాలు, లేఅవుట్ల ఆమోదాన్ని స్ట్రీమ్ లైన్ చేయనుంది. ఇది డెవలపర్లకు ప్రాజెక్టుల అమలును మరింత సులభతరం చేయనుంది. ఈ కార్యక్రమం డెవలపర్లు, ఇన్వెస్టర్లు, కొను గోలుదారులు అందరికీ ఒకే విధంగా తిరుగులేని విలువను అందించగలదని నరెడ్కో తెలంగాణ విశ్వసిస్తోం ది. ఈ విధమైన ప్రగతిశీలక సంస్కరణ యొక్క ప్రయోజనాలను గరిష్ఠస్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం పొందేందుకు వీలుగా ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు నరెడ్కో తెలంగాణ కట్టుబడి ఉంది’’ అని అన్నారు.

భవన నిర్మాణ అనుమతుల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడంలో బిల్డ్ నౌ అప్లికేషన్ విప్లవాత్మకమైంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి విభాగం ఆమోదాల ప్రక్రియలో ఇది మరొక మైలు రాయి కానుంది. త్వరలోనే ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధమైన భవన నిర్మాణ ఆమోదాల విధానాన్ని అను సరిస్తాయి.
మిస్సింగ్ సర్వే నంబర్లు, లేఅవుట్లను ఓపెన్ ల్యాండ్స్ గా చూపెట్టడం, నిషేధిత జాబితాలో సర్వే నంబర్లను తప్పుగా జాబితా చేయడం వంటి మరెన్నో సమస్యలను, డెవలపర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను భూభారతి పోర్టల్ పరిష్కరించగలదని నరెడ్కో తెలంగాణ ఆశిస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles