ప్ర‌కృతిలో నివాసానికి స్వాగతం.. “రాంకీ గ్రీన్ వ్యూ” అపార్టుమెంట్స్

శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో.. మీ కుటుంబ సభ్యులతో కలిసి.. ఆధునిక సదుపాయాల్ని ఆస్వాదిస్తూ.. పచ్చటి పరిసరాల్లో సేదతీరాలని మీరు కోరుకుంటున్నారా? అయితే, ఈ కథనాన్ని మీరు తప్పకుండా చదవాల్సిందే.
  • టూ బెడ్రూమ్ సైజు- 980- 1130 చ.అ.
  • త్రీ బెడ్రూమ్ సైజు- 1160- 2060 చ.అ.
  • క్లబ్ హౌజ్ ఏరియా- 8,236 చ.అ.
  • ధర.. చదరపు అడుక్కీ రూ.3,999

దక్షిణ రాష్ట్రాల నిర్మాణ రంగంలో పేరెన్నిక గల రాంకీ గ్రూప్.. శంషాబాద్ విమానాశ్రయం చేరువలో ఆధునిక పట్టణాన్ని ఆవిష్కరించింది. అదే డిస్కవరీ సిటీ. మూడు వేల ఎకరాల రిజర్వు ఫారెస్టు పక్కనే అభివృద్ధి చేసిన ఈ బడా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్పులో భాగంగా.. 3.81 ఎకరాల్లో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టే.. గ్రీన్ వ్యూ అపార్టుమెంట్స్.

కొంత బేస్మెంట్ ప్లస్ స్టిల్ట్ ప్లస్ ఐదు అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ నిర్మాణంలో 200 ఫ్లాట్లను కడుతున్నారు. అంటే, మొత్తానికి ఐదు బ్లాకుల్లో 2.59 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఎనభై ఫ్లాట్లేమో.. టూ బెడ్రూమ్ కాగా ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లు 120 ఉంటాయి. డిస్కవరీ సిటీలోకి అడుగుపెట్టగానే తివాచీ పర్చిన పచ్చదనం మిమ్మల్ని సాదరంగా స్వాగతం పలుకుతుంది.

గ్రీన్ వ్యూ అపార్టుమెంట్స్ లొకేషన్ విషయానికొస్తే..

వలం రెండంటే రెండే నిమిషాల్లో ఔటర్ రింగ్ రోడ్డు 14వ ఎగ్జిట్ ఉంటుంది. అంటే శ్రీశైలం రోడ్డులోకి దిగగానే సులువుగా ఇందులోకి చేరుకోవచ్చు. ఎలక్ట్రానిక్ సిటీ కూడా ఇంచుమించు ఇంతే దూరంలో ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రయానికి పది నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక, గచ్చిబౌలికి వెళ్లాలంటే ఎంతలేదన్నా అరగంట దాకా అవుతుంది.

 

ఆధునిక సదుపాయాలివే..

రాంకీ ఎస్టేట్స్ ఎక్కడ ప్రాజెక్టును ఆరంభించినా, ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్, జిమ్, మల్టీపర్పస్ హాల్ వంటివి ఏర్పాటు చేస్తోంది.
యోగా హాల్, డిపార్టుమెంటల్ స్టోర్, స్టీమ్ వంటి వాటికి స్థలాన్ని కేటాయించింది. క్యారమ్స్, బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్.. టెన్నిస్ కోర్టు, ల్యాండ్ స్కేప్డ్ గార్డెన్, చిల్డ్రన్ ప్లే ఏరియాలు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కు పెద్దపీట వేసింది.

ప్రస్తుతం మూడు బ్లాకుల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. మరో రెండు బ్లాకులు ప్లాస్టరింగ్ దశలో ఉండగా.. 2021 నవంబరులోపు పనులన్నీ పూర్తి చేయాన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని సంస్థ చెబుతోంది.

This website uses cookies.