భారత్‌లో రియల్ ఎస్టేట్ ధరలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. రియల్ డెవలపర్లకు ఇది సంతోషాన్ని కలిగించేదే అయినా.. కొనుగోలుదారులకు మాత్రం మింగుడుపడని అంశమే. తాజాగా భారత్‌లోని రియల్ ధరలపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ‘మీ దగ్గర 3 మిలియన్ డాలర్లుంటే (దాదాపు రూ.25 కోట్లు) ప్రాపర్టీ ఎక్కడ కొంటారు? గురుగ్రామ్‌లోనా.. లేక న్యూయార్క్‌లోనా? 4 బీహెచ్‌కే ఫ్లాటా లేక 6 బీహెచ్‌కే పెంట్‌హౌసా? గోల్ఫ్‌కోర్సు రోడ్డులోనా లేక మన్‌హాటన్‌లోనా? సైబర్ సిటీనా లేక టైమ్స్ స్క్వేర్‌నా?’ అని ఎక్స్‌లో గుర్జోట్ అహ్లువాలియా అనే వ్యక్తి పోస్టు చేశారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ మాగ్నోలియాస్‌లో విలాసవంతమైన 4 లేదా 5 బీహెచ్‌కే ధర దాదాపు రూ.27 కోట్లు అని.. అదే అత్యధిక ప్రాపర్టీ ధరలు కలిగిన న్యూయార్క్‌లో 6 గదుల పెంట్‌హౌస్ రూ.23 కోట్లకే వస్తుందని పేర్కొన్నారు. దీనిపై పలువురు ఎక్స్ యూజర్లు తీవ్రంగా స్పందించారు.
భారత రియల్ ఎస్టే్‌ట్ మార్కెట్‌పై విరుచుకుపడ్డారు. భారత్‌లో రియల్ ధరలు ఇష్టారీతిన పెంచేస్తున్నారని.. ఇదో పెద్ద కుంభకోణమని ఓ యూజర్ ఆరోపించారు. మిలియన్ డాలర్లతో (దాదాపు రూ.8.4 కోట్లు) అమెరికాలో బంగ్లా కొనుక్కుని రాజుల జీవించొచ్చని.. భారత్‌లో రియల్ ఎస్టేట్ అనేది పట్టపగలు చేసే దోపిడీ అని మరొకరు మండిపడ్డారు. భారత్‌లో స్థిరాస్తి రంగం అతిపెద్ద కుంభకోణమని.. ఈ డబ్బుతో దుబాయ్‌లో ఒకటి కాదు.. రెండు అత్యుత్తమ విల్లాలు కొనుక్కోవచ్చని ఇంకో యూజర్ పేర్కొన్నారు. ‘గుర్గావ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత చెత్తగా ఉంది. దుబాయ్, సింగపూర్, న్యూయార్క్ కంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సౌకర్యాలు మాత్రం అభివృద్ధి చెందని దేశాల్లో ఉన్న విధంగా ఉన్నాయి. అందువల్లే నేను గుర్గావ్ నుంచి చండీగఢ్ వెళ్లాను’ అని ఓ వ్యక్తి వివరించారు.
This website uses cookies.