Categories: TOP STORIES

రిటైల్ లీజింగ్ @ 1.6 మిలియన్ ఎస్ఎఫ్ టీ

దేశంలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రిటైల్ లీజింగ్ 1.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. పరిమాణం పరంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై అగ్రస్థానంలో ఉన్నాయని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. అలాగే హై స్ట్రీట్ అద్దెలు త్రైమాసిక ప్రాతిపదికన 15 శాతం మేర పెరిగాయి. లీజింగ్ లో హై స్ట్రీట్ లదే ఆధిపత్యం. ఈ త్రైమాసికంలో జరిగిన మొత్తం 1.6 మిలియన్ చదరపు అడుగుల లీజు లావాదేవీల్లో 68 శాతం లీజింగ్ హై స్ట్రీట్ లలోనే నమోదైంది. అలాగే మొత్తం లీజింగ్ లో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై కలిసి 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

అలాగే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్ కతాల్లో హై స్ట్రీట్ ల అద్దెలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం మేర పెరిగాయి. ఢిల్లీలో అద్దెలు 13-15 శాతం మేర పెరగ్గా.. బెంగళూరు 12-14 శాతం, ముంబై 5-6 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు మాల్స్ లో లీజింగ్ కార్యకలాపాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. మొత్తం లీజింగ్ పరిమాణంలో కేవలం 32 శాతం మాత్రమే మాల్స్ లో నమోదైంది. 2024 క్యూ3లో కొత్త మాల్ సరఫరా లేకపోవడం ఇందుకు కారణం. అంతర్జాతీయ బ్రాండ్‌ల నుంచి అధిక డిమాండ్ కారణంగా గ్రేడ్-ఎ మాల్స్ లో ఖాళీలు అంతగా లేవని నివేదిక తెలిపింది.

భారతీయ రిటైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. పరిమిత మాల్ సరఫరా కారణంగా హై స్ట్రీట్ లు అధిక లీజింగ్‌ను నమోదు చేస్తూనే ఉన్నాయి. బలమైన డిమాండ్-సరఫరా డైనమిక్ అద్దె వృద్ధికి దారితీసింది’ అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ రిటైల్, మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ షట్దాల్ అన్నారు.

This website uses cookies.