హైదరాబాద్ రాయదుర్గం లోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టి స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టి స్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు.
రోజువారి పనులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి టి స్క్వేర్‌లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. టీ స్క్వేర్ నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది.. ఇప్పటి వరకూ పలువురి సెలబ్రిటీల బర్త్ డేలు, మూవీ అప్డేట్స్‌ను టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించే వాళ్లు.. ఇక నుంచి అవన్నీ హైదరాబాద్‌లోని టీ స్వ్కేర్లో ప్రదర్శించేందుకు వీలు కలుగుతుంది.
This website uses cookies.