Categories: TOP STORIES

బాచుప‌ల్లిలో భ‌లే ప్రాజెక్టు

వాస‌వి అర్బ‌న్

  • ఫ్లాట్ ధ‌ర.. కేవ‌లం రూ.42.5 ల‌క్ష‌లే
  • ఫ్లాట్ కొనేందుకు 10 శాతం క‌ట్టాలి
  • మిగ‌తా సొమ్ము నిర్మాణం పూర్త‌య్యాకే
  • పీఎంఏవై కింద రూ.2.67 లక్ష‌లు ఆదా
  • వ‌డ్డీ మీద 6.5 శాతం స‌బ్సిడీ
  • సీఎల్ఎస్ఎస్ కింద జీఎస్టీ 1 శాత‌మే

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ల‌గ్జ‌రీ గృహాల్ని అందించాల‌న్న దృఢ సంక‌ల్పం.. స‌కాలంలో వాటిని పూర్తి చేయాల‌నే త‌ప‌న ఉన్న‌ప్పుడే.. ఎంత పెద్ద ఆకాశ‌హ‌ర్మ్య‌మైనా అవ‌లీలగా పూర్త‌వుతుందనే విష‌యాన్ని వాస‌వి గ్రూప్ మ‌రోసారి నిరూపించింది. బాచుప‌ల్లిలో కొన్నాళ్ల క్రితం ఆరంభించిన వాస‌వి అర్బ‌న్ అనే మెగా గేటెడ్ క‌మ్యూనిటీ నిర్మాణం చివ‌రి దశ‌కు చేరుకుంది.

కొనుగోలుదారుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కార‌మే ప్రాజెక్టును అందించ‌డానికి విశేషంగా కృషి చేస్తోంది. మ‌రి, హైద‌రాబాద్‌లో అందుబాటు ల‌గ్జ‌రీ విభాగంలోనే అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీ అయిన వాస‌వి అర్బ‌న్ తాజా నిర్మాణ స్థితిగ‌తుల గురించి ఒక‌సారి తెలుసుకుందామా..

హైద‌రాబాద్‌లో సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని భావించేవారికి వాస‌వి అర్బ‌న్ ప్రాజెక్టును మించింది లేద‌ని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇందులో టూ బెడ్రూమ్ ఫ్లాట్ ధ‌ర‌.. కేవ‌లం రూ.42.5 ల‌క్ష‌ల నుంచి ల‌భిస్తుంది. ఫ్లాట్ బుక్ చేయాల‌ని భావించేవారు తొలుత ప‌ది శాతం సొమ్ము చెల్లిస్తే స‌రిపోతుంది. మిగ‌తా మొత్తాన్ని నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత క‌డితే చాలు. మ‌రి, ఇంత త‌క్కువ రేటుకే హైరైజ్ గేటెడ్ క‌మ్యూనిటీలో ఫ్లాటు దొర‌క‌డ‌మంటే మాట‌లు కాదు. ఎందుకంటే ప‌శ్చిమ హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి, కోకాపేట్‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుల్లో ఫ్లాట్ కొనాలంటే చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.10,000 అవుతుంది. పైగా, ఆయా నిర్మాణాల‌న్నీ మైవాన్ ష‌ట్ట‌రింగ్ ప‌రిజ్ఞానంతో నిర్మిస్తున్న‌వే. ఇక్క‌డా ఇదే విధానాన్ని వాస‌వి గ్రూప్ అందిపుచ్చుకుంది. మ‌రి, అక్క‌డికెళ్లి చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.10 వేలు పెట్ట‌లేనివారు.. అంత‌కంటే స‌గం ధ‌రకే బాచుప‌ల్లిలో ఫ్లాట్ కొనుక్కోవ‌చ్చు. పైగా, ల‌గ్జ‌రీ స‌దుపాయాల్లో వాస‌వి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌ట్లేదు. గ‌చ్చిబౌలిలో ల‌భించే ఆధునిక సౌక‌ర్యాల‌న్నీ ఇందులో పొందుప‌రుస్తుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోండి.

ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. వాస‌వి అర్బ‌న్ చుట్టుప‌క్క‌లే అంత‌ర్జాతీయ స్కూళ్లు ఉన్నాయి. పేరెన్నిక గ‌ల ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ ఆస్ప‌త్రులున్నాయి. కాబ‌ట్టి, ఇందులో నివ‌సించేవారు ఎంచ‌క్కా ఆనంద‌క‌ర‌మైన జీవ‌నాన్ని సాగించొచ్చ‌ని సంస్థ చెబుతోంది.
ఇక్క‌డ్నుంచి మియాపూర్ మెట్రో స్టేష‌న్ చేరువ‌లోనే ఉంటుంది. ఇక్క‌డ్నుంచి మ‌ల్లంపేట్‌కు వెళితే చాలు ఔట‌ర్ రింగ్ రోడ్డు మీదికి వెళ్లిపోవ‌చ్చు. అక్క‌డ్నుంచి న‌గ‌రంలోని ఏ ప్రాంతానికైనా సులువుగా చేరుకోవ‌చ్చు.
వాస‌వి గ్రూప్ బాచుప‌ల్లిలోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన.. దాదాపు 17.86 ఎకరాల స్థలంలో.. 12 హైరైజ్ ట‌వ‌ర్ల నిర్మాణ ప‌నులు జోరుగా జ‌రుగుతున్నాయి. దాదాపు 70 శాతం ఓపెన్ స్పేస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు.. బాచుప‌ల్లికే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇందులో వ‌చ్చేవ‌న్నీ 2 బీహెచ్‌కే ఫ్లాట్లే. వీటి విస్తీర్ణం.. 875 నుంచి 975 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉంటుంది. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 3714 యూనిట్లు. ధ‌ర కూడా కేవ‌లం రూ.42.5 ల‌క్ష‌ల నుంచి ఆరంభం. 2020 సెప్టెంబ‌రులో ఆరంభ‌మైన ఈ ప్రాజెక్టును నిర్ణీత గ‌డువులోపు అంద‌జేయాల‌న్న‌ ల‌క్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. మ‌రి, వివిధ ట‌వ‌ర్లు ఏయే స్థాయిలో ఉన్నాయంటే..
  • బ్లాక్ 1, 2, 3 : వేగంగా నిర్మాణ‌ ప‌నులు
  • బ్లాక్ 4 : స్ట్ర‌క్చ‌ర్ పూర్తి
  • బ్లాక్ 5 : 12 అంత‌స్తులో ప‌ని జ‌రుగుతోంది
  • బ్లాక్ 6 : వేగంగా ప‌నులు
  • బ్లాక్ 7 : స్ట్ర‌క్చ‌ర్ పూర్తి
  • బ్లాక్ 8 : సెల్లార్ ప‌నులు ప్రారంభం
  • బ్లాక్ 9 : స్ట్ర‌క్చ‌ర్ పూర్తి
  • బ్లాక్ 10 : స్ట్ర‌క్చ‌ర్ పూర్తి
  • బ్లాక్ 11: శ్లాబులు పూర్త‌య్యే ద‌శ

మూడు క్ల‌బ్ హౌజులు

వాస‌వి అర్బ‌న్ ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇందులో మూడు క్ల‌బ్ హౌజుల‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటి విస్తీర్ణం సుమారు ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉంటుంది.

ఇందులో ఆధునిక స‌దుపాయాల‌న్నీ పొందుప‌రుస్తున్నారు. పార్టీ లాన్, క్లోజ్డ్ కార్ పార్కింగ్, వాస్తు, మెయింటనెన్స్ సిబ్బంది, వాటర్ స్టోరేజ్, విజిటర్ పార్కింగ్, రిజర్వ్ డ్ పార్కింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఏరోబిక్స్ రూమ్, సర్వీస్ లిఫ్ట్, రెస్టారెంట్స్, పార్టీ హాల్, 24 గంటల సెక్యూరిటీ, మెడికల్ ఫెసిలిటీస్, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, యోగా, మెడిటేషన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, ఫుడ్ కోర్టు, కార్ వాష్ ఏరియా, 24 గంటల నీటి సరఫరా, ఇంటర్ కమ్, సీసీటీవీ, ల్యాండ్ స్కేపింగ్, స్పోర్ట్స్ ఏరియా, సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, మల్టీపర్పస్ రూమ్, హెల్త్ ఫెసిలిటీస్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బాంకెట్ హాల్, యాంఫీ థియేటర్, కమ్యూనిటీ హాల్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, పవర్ బ్యాకప్, జిమ్నాజియం, స్విమింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.

ప్రాజెక్టు పరిచయం

ప్రాజెక్టు పేరు: వాసవి అర్బన్
ఎక్కడ? బాచుపల్లి
స్థ‌ల విస్తీర్ణం: 17.34 ఎకరాలు
మొత్తం బ్లాకులు: 12
బ్లాకుల ఎత్తు: 2 సెల్లార్లు + స్టిల్ట్ + 23 అంతస్తులు
ఫ్లాట్ల సంఖ్య: 3714
ఫ్లాట్ల విస్తీర్ణం: 875, 950, 975 చ.అ.

గ‌చ్చిబౌలి కంటే ఇక్క‌డే బెస్ట్.. ఎందుకంటే?

గ‌చ్చిబౌలి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఒక ఫ్లాట్ కొనాలంటే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.10 వేలు అవుతుంది. అక్క‌డా మైవాన్ ష‌ట్ట‌రింగ్ ప‌రిజ్ఞానంతోనే ఫ్లాట్ల‌ను నిర్మిస్తారు. ఆ విధానంలో ప్రాజెక్టుల ఎలివేష‌న్లకు సంబంధించి ఎలాంటి వైవిధ్యం ఉండ‌దు.

పైగా, ఆధునిక స‌దుపాయాల విష‌యంలోనూ పెద్ద‌గా తేడా ఏమీ ఉండ‌దు. కాక‌పోతే చూడ‌టానికి కొంత ల‌గ్జ‌రీగా క‌నిపించొచ్చు. సానిటరీ, హార్డ్‌వేర్‌, ఫ్లోరింగ్ వంటి అంశాల్లో కొంత తేడా ఉండొచ్చు. ఔట‌ర్ రింగ్ రోడ్డు ఎక్కి.. ఇర‌వై నిమిషాలు ప్ర‌యాణం చేయ‌గ‌లిగితే చాలు.. అంత‌కంటే స‌గం రేటుకే వాస‌వి అర్బ‌న్‌లో కొనొచ్చు. ఇక్క‌డా మైవాన్ ష‌ట్ట‌రింగ్‌లోనే క‌డ‌తారు. 23 అంత‌స్తుల నిర్మాణం. పైగా, ఆధునిక సౌక‌ర్యాల్లో రాజీ లేదు. కాబ‌ట్టి, ఐటీ మ‌రియు ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేసేవారికి.. చిన్న కుటుంబాల‌కు.. వాస‌వి అర్బన్‌ను మించిన ప్రాజెక్టు లేద‌ని చెప్పొచ్చు.

This website uses cookies.