Categories: LATEST UPDATES

ఫ్లాట్ల ధరల్లోనూ డైనమిక్ ప్రైసింగ్

అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు పెంచడానికి ఢిల్లీ డెవలప్ మెంట్ అథార్టీ (డీడీఏ) చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్, ఎల్ ఐజీ విభాగాల్లో అమ్ముడుపోని ఫ్లాట్లపై దృష్టి పెట్టింది. వీటి అమ్మకాలకు డిమాండ్ తీసుకొచ్చేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం తేవాలని యోచిస్తోంది. ‘అమ్మకాల లక్ష్యాలు నిర్దేశించడంతోపాటు మౌలిక వసతుల కల్పన, కనెక్టివిటీ పెంచే చర్యలు చేపట్టాం. అలాగే డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నాం.

అంటే ఫ్లాట్ల ధరలను సమగ్ర పద్ధతిలో నిర్ణయించాలి. దీనికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’ అని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయా ఫ్లాట్లను నిర్దేశిత ధరలకు అమ్ముతున్నామని.. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ల అమ్మకాలు పెంచడానికి వాటి ధరలు తగ్గించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం డీడీఏలో 16వేల వరకు అమ్ముడుపోని ఇన్వెంటరీ ఉంది. సరైన మెట్రో కనెక్టివిటీ లేకపోవడం వల్ల అవి అమ్ముడుకావడంలేదు. అదే సమయంలో మే మాసాంతానికి మరో 23వేల కొత్త ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ ఫ్లాట్లు రాబోతున్నాయి. దీంతో కొత్తగా అందుబాటులో ఉండే ఫ్లాట్ల సంఖ్య 40వేలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వాటి అమ్మకాలకు డైనమిక్ ప్రైసింగ్ విధానం తేవాలని డీడీఏ యోచిస్తోంది.

This website uses cookies.