నాన్ లేఔట్ వెంచర్లు వేస్తే కఠిన చర్యలు

  • రియల్టర్లకు కుడా చైర్మన్ హెచ్చరిక

నాన్ లేఔట్ వెంచర్లు వేసే రియల్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ (కుడా) చైర్మన్ సుందర్ రాజ్ హెచ్చరించారు. వరంగల్ జిల్లా ఇనవోలు మండలం పంథని, పున్నెల్ గ్రామాల్లో కొందరు రియల్టర్లు లే ఔట్ లేకుండా వెంచర్లు వేసి విక్రయిస్తున్నారనే సంగతి తెలుసుకున్న ఆయన.. వెంటనే సంబంధిత అధికారులను అక్కడకు పంపించారు. పంథని గ్రామంలోని సర్వే నెంబర్ 26లో ఉన్న ఆరు ఎకరాల భూమిలో లోకేష్, సాగర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు నాన్ లే ఔట్ వెంచర్ వేసినట్టు అధికారులు నిర్ధారించారు.

వెంటనే వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు ఫెన్సింగ్ ను కూల్చివేశారు. అలాగే పున్నెల్ గ్రామంలోని 583 సర్వే నెంబర్ లో ఉన్న 20 గుంటల్లో, 81వ సర్వే నెంబర్లో ఉన్న రెండు ఎకరాల్లో వేసిన నాన్ లేఔట్ వెంచర్ ఫెన్సింగులను తొలగించారు. సదరు భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఇలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నాన్ లేఔట్ వెంచర్లు వేస్తే.. ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కుడా చైర్మన్ సుందర్ రాజ్ కోరారు. ఇలాంటి నాన్ లేఔట్ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపొవద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్ కొంటే.. ఇంటి నిర్మాణానికి అనుమతుల తెచ్చుకోవడానికి, ఇతర మౌలిక వసతులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టంచేశారు. రియల్టర్లు కుడాతో కలిసి పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ కింద వెంచర్లు చేపట్టవచ్చని పేర్కొన్నారు.

This website uses cookies.