Categories: LATEST UPDATES

ప్రవాసుల పెట్టుబడులు పెరిగాయ్

  • 2023 మొదటి అర్ధభాగంలో 15 శాతం
    పెరిగిన ఎన్నారైల పెట్టుబడులు

రూపాయి విలువ తగ్గుతుండటం, పెట్టుబడి ఆధారిత కొనుగోళ్లు పెరుగుతున్న ట్రెండ్ కారణంగా భారతీయ ప్రాపర్టీ మార్కెట్ లో ప్రవాస భారతీయుల (ఎన్నారైల) పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతేడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే.. ఈ ఏడాది ప్రథమార్ధంలో 15 శాతం మేర ఎన్నారైల పెట్టుబడులు పెరిగినట్టు నిపుణులు అంటున్నారు. పండగ సీజన్లో ఇవి మరింత పెరగవచ్చని.. ముఖ్యంగా గల్ఫ్ ప్రాపం నుంచి ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా. ఎన్నారైలు ప్రధానంగా ఇష్టపడే భారతీయ నగరాల్లోని డెవలపర్లు ఆకర్షణీయమైన ప్యాకేజీలు ప్రకటించడం, ధరల్లో రాయితీ ఇవ్వడం, లగ్జరీ ప్రాజెక్టులను అంత్జాతీయంగా లాంచ్ చేయడం, ప్రాపర్టీ ఎంపికల్లో ప్రత్యేకంగా సహాయం అందించడం వంటి అంశాలు ఎన్నారైల పెట్టుబడులు పెరగడానికి కారణమని చెబుతున్నారు.

2022, 2023 మధ్య డిమాండ్ పోల్చి చూస్తే.. ఎన్నారైల పెట్టుబడులు కచ్చితంగా పెరుగుతాయని బలంగా అనిపిస్తోందని అనరాక్ గ్రూప్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా ఎండీ మోర్గాన్ ఓవెన్ చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో 10 నుంచి 15 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రవాసులు పెట్టుబడులు పెరిగాయి. డీఎల్ఎఫ్ ప్రాజెక్టుల్లో ఎన్నారై పెట్టుబడులు 15 నుంచి 20 శాతం పెరిగాయని స‌మాచారం.
గత రెండేళ్లలో భారత్ లో ఇంటిని కొనుగోలు చేయాలనుకునే ఎన్నారైల సంఖ్య పెరిగారు. రెసిడెన్షియల్ మార్కెట్ ఈ ఏడాది ఎన్నారైల నుంచి విశేషమైన ఆదరణ పొందింది. కోవిడ్ తర్వాత బలమైన భావోద్వేగాలు ఎనారైలను మాతృభూమిలో నివాసం కలిగి ఉండాలనే ఆకాంక్ష పెరిగింది. అనరాక్ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2,29,000 రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాలు జరిగినట్టు వెల్లడైంది. ఈ మొత్తం అమ్మకాల్లో సగటున ఎన్నారైల వాటా 10 నుంచి 15 శాతం ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రవాస భారతీయులు బెంగళూరు, హైదరాబాద్, పుణె వంటి టెక్ సిటీలనే ఇష్టపడుతున్నారు. గల్ఫ్ లోని ప్రవాసుల‌కు ఈ నగరాల్లో పెట్టుబడుల ఎంపికలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నగరాలు కాస్మొపాలిటన్ స్వభావాన్ని కలిగి ఉండటంతో ఎన్నారైలను ఆకర్షితులవుతున్నారు. అలాగే లగ్జరీ, బ్రాండెడ్, పెద్ద డెవలపర్ల వద్ద నుంచే ప్రాపర్టీ కొనుగోలుకు ప్రవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు చండీగఢ్, పంచకుల, గోవా, కొచ్చి వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలపైనా ప్రవాసులు దృష్టి సారించారు. హాలిడే హోమ్ లేదా సెకండ్ హోమ్ ల కోసం చూసేవారు వీటిని ఎంచుకుంటున్నారు.

This website uses cookies.