poulomi avante poulomi avante

ఆఫీసులు ఉండాల్సిందే..

  • ఉద్యోగులను కార్యాలయాలకు తీసుకొచ్చేందుకు చర్యలు
  • హైబ్రిడ్ పని విధానం ఉన్నా.. ఆఫీసుకే ప్రధమ ప్రాధాన్యత
  • సీబీఆర్ఈ సర్వేలో వెల్లడిc

కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం విధానానికి ప్రాధాన్యత పెరిగింది. అప్పటివరకు కేవలం ఐటీ రంగానికి మాత్రమే ఉన్న ఈ వెసులుబాటు పలు ఇతర రంగాలకు కూడా విస్తరించింది. ఆయా రంగాలు కూడా ఇంటి నుంచి పని విధానాన్ని విజయవంతంగా అమలు చేశాయి. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కూడా ముగిసి పరిస్థితులు కాస్త చక్కబడిన నేపథ్యంలో ఇంటి నుంచి పని విధానం విషయంలో కంపెనీల వైఖరి ఏమిటి? ఈ విధానాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేటు లిమిటెడ్ ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య నిర్వహించిన సర్వే ఫలితాలను ‘ఇంయా ఫ్యూచర్ ఆఫ్ ఆఫీస్ సర్వే 2021’ పేరుతో విడుదల చేసింది.

దేశంలో దాదాపు లక్షకు పైగా ఉద్యోగులున్న దాదాపు వంద కంపెనీలను ఈ సర్వేలో భాగస్వాములు చేసింది. రియల్ ఎస్టేట్ రంగంతోపాటు టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, మౌలిక వసతుల, లాజిస్టిక్స్, పరిశోధన, ఫార్మా వంటి పలు కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. భౌతిక కార్యాలయాలు ఉండాల్సిందేనని ఏకంగా 80 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. అదే సమయంలో కార్యాలయంలో భద్రత, సౌకర్యాల వంటివి మరింత అవసరమని పేర్కొన్నారు. చాలా కంపెనీలు తమ ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి రావాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తంచేశారు. భౌతిక కార్యాలయాలు ఉండాలని, ఉద్యోగులు ఆఫీసు నుంచి పని చేయాలని 80 శాతం మంది చెప్పగా.. ఆఫీసు నుంచి లేదా ఇంటి నుంచి పనిచేసే విషయంలో ఉద్యోగులకే ఎంపిక నిర్ణయాన్ని ఇచ్చేలా కొత్త విధానాలు తీసుకురావాలని భావిస్తున్నట్టు 58 శాతం మంది వెల్లడించారు. అదే సమయంలో తమ ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు వచ్చేలా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి ఆయా కంపెనీలు సుముఖంగా ఉండటం విశేషం. ఇందుకోసం సాంకేతికను మెరుగుపరచడం.. అడ్మిన్, ఎంఎం సేవలు, సౌకర్యాలు కల్పించడం, కార్యాలయ చోటును పెంచడం వంటి అంశాలపై దృష్టి పెట్టాయి.

కరోనా మహమ్మారి సమయంలో హైబ్రిడ్ పని విధానం ఎక్కువగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంపాటు దీనిని కొనసాగించడం సాధ్యం కాకపోవచ్చని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజీన్ తెలిపారు. ఒకవేళ హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, చాలా కంపెనీలు తమ ఉద్యోగులు కార్యాలయం నుంచి పని చేయాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఇక కరోనా కల్లోలం తర్వాత దేశంలో వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయని సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 88 శాతం మంది తేల్చిచెప్పారు. తొలి వేవ్ తర్వాత 2020లో సీబీఆర్ఈ నిర్వహించిన అధ్యయనంతో పోలిస్తే ఈ అంశంలో గణనీయమైన పురోగతి కనిపించింది.

సర్వే ముఖ్యాంశాలివీ..

– సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది వచ్చే రెండేళ్లలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తారని వివరించారు.
– దేశవ్యాప్తంగా కార్యాలయాలకు తిరిగి వచ్చి పనిచేసే విషయంలో వేగం ఒక్కోచోట ఒక్కోలా ఉంది. 2021 జూన్-ఆగస్టులో దేశంలో కార్యాలయాల సగటు వినియోగ రేటు 25 శాతం కంటే తక్కువగా ఉంది.
– ఆఫీసు నుంచి పనిచేసే విధానంతోపాటు ఇంటి నుంచి పని చేయడానికి కూడా అనుమతించాలని భావిస్తున్నట్టు 58 శాతం మంది చెప్పారు. ఏపీఏసీలో ఇది 47 శాతం మాత్రమే ఉంది.
– దీర్ఘకాలంలో దేశంలో నెలకు కనీసం ఒకరోజు నుంచి నాలుగు రోజులు హైబ్రిడ్ వర్క్ ఫార్మాట్ ఉండనుంది.
– కంపెనీలు ముందుగా ఆమోదించిన అంశాల ఆధారంగా హైబ్రిడ్ వర్కింగ్ అర్హతలను మేనేజర్లు నిర్ణయించాలని 42 శాతం మంది అభిప్రాపయడ్డారు. ఏపీఏసీలో ఇది 30 శాతంగా నమోదైంది.
– అత్యంత ప్రాధాన్యత కలిగిన స్వల్పకాలిక లీజింగ్ వ్యూహాల్లో పునరుద్ధరణలు (49శాతం), పున:సంప్రదింపులు (44శాతం), సౌకర్యవంతమైన నిబంధనలు (29 శాతం) ఉన్నాయి.
– భవిష్యత్తులో టచ్ లెస్ టెక్నాలజీ (82శాతం), మెరుగైన గాలి నాణ్యత (76 శాతం), మరింత విశాలమైన చోటు (57శాతం) కావాలని సర్వేలో తేలింది.
– రెండేళ్ల తర్వాత కూడా తలసరి చోటు 75 నుంచి 125 చదరపు అడుగులు ఇవ్వడం కొనసాగిస్తామని దాదాపు 60 శాతం మంది వెల్లడించారు.

భవిష్యత్తు కార్యాలయాలు ఇలా..

హైబ్రిడ్ వర్కింగ్

ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకురావాలనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అదే సమయంలో చాయిస్ తోపాటు పలు సౌకర్యాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. హైబ్రిడ్ పని విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి ముందు చాలా కంపెనీలు దీనిని పైలట్ విధానంలో అమలు చేస్తున్నాయి. దేశంలో దాదాపు 25 శాతం మందికి తరచుగా లేదా అప్పుడప్పుడు హైబ్రిడ్ పని విధానం కల్పించాలని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. హైబ్రిడ్ పని విధాన అర్హతలు, ఆమోదాలను స్పష్టమైన మార్గదర్శకాలతో నియంత్రించాలని సీబీఆర్ఈ పేర్కొంది. ఏపీఏసీ ప్రాంతాలతో పోలిస్తే దేశంలో ఇది కాస్త కష్టంగా ఉండనుంది.

పోర్ట్ ఫోలియో పెరుగుదల

చాలామంది ఉద్యోగులకు భౌతికంగా కార్యాలయం చాలా అవసరం. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్ ఫోలియోలను విస్తరించాలని భావిస్తున్నాయి. దీంతో హైబ్రిడ్ పని విధానం, పోర్ట్ ఫోలియో విస్తరణల విషయంలో కొత్తకొత్త వ్యూహాలు పుట్టుకొస్తున్నాయి. స్వల్పకాలిక పోర్ట్ ఫోలియో వ్యూహాల్లో.. సౌకర్యవంతమైన చోటు, కన్సాలిడేషన్ టాప్ లో ఉన్నాయి. ఆన్ డిమాండ్ సమావేశ స్థలం నుంచి అనుకూలమైన ప్రైవేటు సూట్ ల వరకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

కార్యాలయ వ్యూహాలు..

సహకార, సాంకేతికంగా మెరుగైన ప్రదేశాలను జోడించడం ద్వారా హైబ్రిడ్ పని విధానాన్ని మరింతగా ప్రోత్సహించే దిశగా కార్యాలయాలు తయారవుతున్నాయి. వచ్చే రెండేళ్లలో తమ స్టాఫ్ టు డెస్క్ నిష్పత్తిని గణనీయంగా పెంచాలని భావిస్తున్నట్టు పలు కంపెనీలు వెల్లడించాయి.

కార్యాలయ భవిష్యత్తు పాత్ర

హైబ్రిడ్ పని విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో కార్యాలయాల పాత్ర ఉద్యోగుల సహకార కేంద్రంగా మారనుంది. భద్రత, ఆరోగ్యం, ఉత్పాదకత, మరింత సౌకర్యవంతమైన వర్క్ ఫోర్స్ ఇచ్చే విషయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఆరోగ్యం, భద్రతకే కీలక ప్రాధాన్య ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టచ్ లెస్ టెక్నాలజీని అమలు చేయాలని భావిస్తున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles