Categories: TOP STORIES

ఆఫీసు అద్దెలు తగ్గుముఖం

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం హైదరాబాద్ ఆఫీసు డిమాండ్ పై కొంతమేరకు ప్రభావం చూపెట్టింది. 2020 ద్వితీయ త్రైమాసికంతో పోల్చితే ప్రస్తుతం నగర ఆఫీసు మార్కెట్లో ఖాళీలు 14 శాతం దాకా నమోదయ్యాయి. గతేడాది ఇది 6.5 శాతంగా నమోదు అయ్యింది. పలు స్థల యజమానులు అద్దెల్ని తగ్గించేందుకు అంగీకరిస్తున్నారు. మరో 12 నుంచి 18 నెలలు హైదరాబాద్లో ఆఫీసు మార్కెట్ అద్దెదారులకు అనుకూలంగా ఉండే అవకాశముంది.

2021 ద్వితీయ త్రైమాసికంలో 28 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పలు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండు రెట్లు అధికంగా నమోదైంది. లెగాలో, క్వాల్ కామ్ వంటి సంస్థలు 20 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. 8 లక్షల చ.అ. స్థలాన్ని పలు కంపెనీలు తక్షణ అవసరాల నిమిత్తం లీజుకు తీసుకోవడం విశేషం. వ్యాక్సీనేషన్ ప్రక్రియ ముమ్మరం కావడంతో కొన్ని సంస్థలు తమ వ్యూహాల్ని మారుస్తున్నాయి. ఇవి మాదాపూర్లోనే 90 శాతం లీజుకు తీసుకున్నాయి. పాత ఫర్నీష్డ్ స్పేస్ లభించడంతో పలు చిన్న సంస్థలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. ఐటి-బిపిఎమ్, ఇంజనీరింగ్ మరియు హెల్త్ కేర్ రంగాలు ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. సరళమైన వర్క్ స్పేస్ లు నెమ్మదిగానే పెరుగుతూనే ఉన్నాయి.

పెరిగిన సరఫరా

రెండో త్రైమాసికంలో 18 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇందులో 72 శాతం అప్పటికే ప్రీ లీజింగ్ పూర్తయ్యింది. కొన్ని సంస్థలు మార్కెట్ నుంచి నిష్క్రమించినప్పటికీ, 14 శాతం దాకా డిమాండ్ పెరిగింది. గత పన్నెండు నెలల్లో ఖాళీ రేటు రెట్టింపు అయ్యింది. అయితే, కొత్త స్థలం అందుబాటులోకి రావడంతో పలు సంస్థలు తమ వ్యూహాల్ని మార్చుకున్నాయి. 2021 ద్వితీయార్థంలో ఎంతలేదన్నా మరో 40 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వస్తుంది. కాకపోతే, ఇందులో ఇప్పటికే సింహభాగం ప్రీ లీజింగ్ జరిగింది.

రేట్లు తగ్గాయా?

మాదాపూర్, గచ్చిబౌలిలో ఆఫీసు మార్కెట్ ఖాళీ అవుతున్నప్పటికీ.. అద్దెలు మాత్రం మూడు నెలల్నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అద్దెలను స్వల్పంగా తగ్గించుకునేందుకు అంగీకరిస్తున్నారు. రానున్న 18 నెలల దాకా మార్కెట్ అద్దెదారులకు అనుకూలంగా ఉంటుంది.

ఏ సంస్థ? ఎంత స్థలం?

ప్రాపర్టీ ఎక్కడ? అద్దెదారుడు చ.అ.
అవాన్స్ హెచ్ఓ9 మాదాపూర్ లెగటో 2.90 లక్షలు
కేఆర్సీ కామర్ జోన్ మాదాపూర్ క్వాల్ కామ్ 15 లక్షలు
జీఎంఆర్ ఏరో టవర్ 2 శంషాబాద్ ఓఎస్ఐ సిస్టమ్స్ 46 వేలు

 

కీలకమైన ప్రాజెక్టులు

ప్రాపర్టీ అద్దెదారుడు చ.అ. పూర్తి?
ఫినీక్స్ ట్రైవియం 3 జెన్ ప్యాక్ట్ 343620 2021 క్యూ 3
దివ్యశ్రీ ఓరియన్ బ్లాక్ 8 వెల్స్ ఫార్గో 1100000 2021 క్యూ 4

This website uses cookies.