poulomi avante poulomi avante

ప్రెస్టీజ్ ఎస్టేట్స్ పై రెరా జరిమానా విధించాలి!

ప్రెస్టీజ్ వంటి నిర్మాణ సంస్థలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నాయి. రెరా అనుమతి లేకుండా ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించకూడదని రెరా నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. ఛానెల్ పార్టనర్ల ద్వారా సోషల్ మీడియాలో పబ్లిసిటీని నిర్వహిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఛానెల్ పార్ట్ నర్లు తమకు తెలియకుండా ప్రచారాన్ని చేపడుతున్నారని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరి, ఆయా ఛానెల్ పార్ట్ నర్లు ఏ ప్రాజెక్టును పబ్లిసిటీ చేస్తున్నాయి? ఏ ప్రాజెక్టు ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి? ప్రెస్టీజ్ సంస్థకు చెందిన ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి కాబట్టి.. ఛానెల్ పార్ట్ నర్లు చేసే ప్రచారానికి ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పైగా, రెరా అనుమతి గల ఏజెంట్లు.. రెరా అనుమతి గల ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయించాలి. లేకపోతే, వారి మీద కూడా రెరా చర్యల్ని తీసుకుంటుందనే విషయం తెలిసిందే.

కోకాపేట్లోని నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో ప్రెస్టీజ్ సంస్థ.. ఎకరం రూ.37 కోట్ల చొప్పున.. 7.5 ఎకరాల స్థలాన్ని.. సుమారు రూ.285 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో ఫ్లాట్లు కడితే అపూర్వమైన ఆదరణ ఉంటుందనే ఏకైక కారణంతోనే.. వేలంలో పాల్గొని స్థలాన్ని కైవసం చేసుకుంది. అయితే, ప్రాజెక్టును ప్రారంభించాలంటే.. రెరా అనుమతిని తప్పక తీసుకోవాలి. ఇక్కడ స్థలాన్ని కొన్న మై హోమ్, పౌలోమీ వంటి సంస్థలు.. రెరా నుంచి అనుమతి తీసుకున్నాకే అధికారికంగా ప్రచారాన్ని నిర్వహించి ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి.

కానీ, ఇవేమీ పట్టించుకోకుండా.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఏకంగా ఛానెల్ పార్ట్ నర్లతో ప్రచారాన్ని నిర్వహిస్తూ మరీ క్లెయిర్ మోంట్ ప్రాజెక్టులో ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఇదే విషయాన్ని సంస్థ ప్రతినిధిని ప్రశ్నిస్తే.. తాము బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నామని.. ఫ్లాట్లను విక్రయించడం లేదని బుకాయిస్తున్నారు. మరి, రెరా అనుమతి తీసుకోకుండా ఇలా బుకింగులు తీసుకోవచ్చా?.. ఈ ప్రశ్నకు ప్రెస్టీజ్ సంస్థ ఛైర్మన్ ఇర్ఫాన్ రజాక్ సమాధానం ఇవ్వాల్సిన అవసరముంది. తను క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు, ఛైర్మన్ గా పని చేశారు కాబట్టి.. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. రెరా రాక ముందు నుంచీ ఈ స్వీయ ప్రవర్తనా నియమావళిని క్రెడాయ్ డెవలపర్లు దేశవ్యాప్తంగా పాటిస్తున్నారు. మరి, ఈ సంస్థ ఎందుకీ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పూర్తిగా విస్మరించిందో తెలియట్లేదు.

Prestige Clairmont Hyderabad

వాస్తవానికి చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రెరా అనుమతి తీసుకోవడమెంతో సులభం. అలాంటిది, దేశంలోనే నిర్మాణ దిగ్గజమైనా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ హైదరాబాద్లో రెరా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమైన విషయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇలాగే అడ్డదారిలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. రెరా అనుమతి లేకుండా.. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో.. ఛానెల్ పార్ట్ నర్ల ద్వారా ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు ఫ్లాట్ల బుకింగులు తీసుకోవడం.. బయ్యర్ల నుంచి చెక్కులు కూడా తీసుకున్నందుకు.. తెలంగాణ రెరా అథారిటీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ పై ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానాను విధించాలి.

ప్రెస్టీజ్ కు నోటీసు!

రియల్ ఎస్టేట్ గురు కథనానికి స్పందనగా.. తెలంగాణ రెరా అథారిటీ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కి నోటీసును జారీ చేసింది. మరి, దీనిపై ప్రెస్టీజ్ సంస్థ ఎలాంటి జవాబును అందిస్తుందో చూడాలి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles