Categories: TOP STORIES

పీపుల్స్ ప్యారడైజ్ సొసైటీ.. ఎస్ఎంఆర్ వినయ్ సిటీ..

SMR VINAY CITY.. PEOPLE’S PARADISE CITY..SOCIETY

పవిత్రత, ప్రశాంతత కారణంగా మన కేరళను దేవుడి సొంత దేశం అని పిలుస్తాం. అలాంటి ప్రశాంతతను అందుకోవాల‌ని ఆశించేవారు.. ఒక్క‌సారి ఎస్ఎంఆర్ విన‌య్ సిటీని సంద‌ర్శిస్తే స‌రిపోతుంది. మియాపూర్ మెట్రో స్టేష‌న్‌కు కూత‌వేటు దూరంలో.. పుష్కలమైన ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ గేటెడ్ సొసైటీ భిన్న‌త్వంలో ఏక‌త్వానికి ప్ర‌తీక‌గా నిలుస్తుంది. దాదాపు ఐదున్న‌ర ఎకరాల విస్తీర్ణంలో.. చక్కని వెంటిలేషన్ గ‌ల ఐదు వంద‌ల‌కు పైగా ఫ్లాట్లతో రూపుదిద్దుకున్న ఈ క‌మ్యూనిటీలో నివాసితులు ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదిస్తారు. పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు తమ ఆకాంక్షలకు అనుగుణంగా జీవిస్తారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇంత‌కు మించిన మరో ప్రదేశం లేదంటే అతిశయోక్తి కాదు.

ప్రజలు తమ ఆచార వ్యవహారాలను పాటించేలా.. ప్రతి సంస్కృతి, సంప్రదాయానికి ఈ క‌మ్యూనిటీలో ప్రాధాన్యతనిస్తారు. అన్ని ముఖ్య‌మైన పండుగుల‌ను క‌లిసిక‌ట్టుగా జ‌రుపుకుంటారు. చిల్డ్ర‌న్స్ డే, విమ‌న్స్ డే వంటివ‌న్నీ నిర్వ‌హిస్తారు. భవిష్యత్తుతరాన్ని మరింత మెరుగ్గా చేయడంలో ముఖ్య‌భూమిక పోషించే మ‌హిళ‌లు.. ప్ర‌శాంతంగా నివ‌సిస్తూ.. ప్ర‌తి క్ష‌ణాన్ని ఆస్వాదించే సొసైటీ ఇది. పురుషులకు వినోద ప్రపంచం వారి చేతికి అందేంత దూరంలోనే ఉంది. వారాంతం వ‌స్తే చాలు క్రికెట్ ఆట‌ను ఆస్వాదించే యువ‌త కేరింత‌ల‌తో ఈ ప్రాంతం మార్మోగిపోతుంది. చిన్నారులు, టీనేజీ యువ‌త సాయంత్రం కాగానే ఇక్క‌డి బాస్కెట్ బాల్ ఫుల్ కోర్టులో పోటీ ప‌డుతూ బాస్కెట్లు వేస్తుంటారు. లాన్ టెన్నిస్‌, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడ‌టంతో పాటు మ‌హిళ‌లు, యువ‌తీయువ‌కులు ఇండోర్ స్టేడియంలోని ష‌టిల్ ఆట‌ను ఆస్వాదిస్తారు. పెద్ద‌లు సైతం పిచ్చాపాటీగా క‌బుర్లు చెప్పుకుంటూ ఎంతో ఉత్సాహంతో వాకింగ్ చేస్తూ ద‌ర్శ‌న‌మిస్తారు.

అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌..

ఎస్ఎంఆర్ విన‌య్ సిటీ అద‌న‌పు ఆకర్ష‌ణ ఏమిటంటే.. ఇక్క‌డ క్ల‌బ్ హౌజ్‌లో జిమ్‌తో పాటు యాంఫీ థియేట‌ర్ ప‌క్క‌నే ఓపెన్ జిమ్ కూడా ఉంది. వేస‌వి వ‌స్తే చాలు చిన్నారులు, యువ‌త‌, మ‌హిళ‌లంతా కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తారు. అత్య‌వ‌స‌ర స‌మయాల్లో అపోలో క్లీనిక్ ఉంది. సుమారు 60కి పైగా సీసీటీవీ కెమెరాలు, ఇర‌వై నాలుగు గంట‌లూ భ‌ద్ర‌తా సిబ్బంది ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి భ‌యం లేకుండా ఆనందంగా గ‌డ‌పొచ్చు. లైబ్ర‌రీ, సీనియ‌ర్ సిటిజ‌న్ల కోసం ప్ర‌త్యేక గ‌ది, పైపుల ద్వారా గ్యాస్ స‌ర‌ఫ‌రా, ఆవ‌ర‌ణ‌లో సూప‌ర్ మార్కెట్‌, టిఫిన్ సెంట‌ర్ వంటివి ఉండ‌నే ఉన్నాయి. వారంలో సుమారు మూడు రోజుల పాటు రైతుబ‌జార్‌తో పాటు ఇత‌ర కూర‌గాయ‌ల విక్రేత‌లు విచ్చేస్తారు.

స‌మాజ‌సేవ‌లో మేము సైతం..

ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవడానికి ఎస్ఎంఆర్ విన‌య్ సిటీ నివాసితులు ఎల్ల‌ప్పుడూ ముందంజ‌లో ఉంటారు. ర‌క్త‌దాన శిబిరాలు, ఉచిత డెంట‌ల్ చెక‌ప్ క్యాంపులు, ఆరోగ్య శిబిరం వంటివి క్ర‌మం త‌ప్ప‌కుండా జ‌రుగుతాయి. మొత్తానికి, ఆహ్లాద‌క‌ర‌మైన ప‌రిస‌రాలు మంచి మ‌నుష్యుల‌తో ఈ గేటెడ్ క‌మ్యూనిటీ నిత్యం క‌ళ‌క‌ళ‌లాడుతుంది. అందుకే, జీహెచ్ఎంసీ నుంచి ఉత్త‌మ గేటెడ్ సొసైటీగా అవార్డుల‌ను సైతం అందుకుంది. ఇలాంటి ఆనందకరమైన, ప్రశాంతమైన పరిసరాలతో కూడిన గేటెట్ కమ్యూనిటీలో ఫ్లాట్లు దొర‌క‌డ‌మంటే అంత సులువేం కాదు. అమ్మ‌కానికైనా అద్దెల‌కైనా ఎస్ఎంఆర్ విన‌య్ సిటీకి ఎక్క‌డ్లేని ఆద‌ర‌ణ సంపాదించింది. ముఖ్యంగా, ఇందులోని క్రికెట్ గ్రౌండ్ ప్ర‌తిఒక్క‌ర్ని అమితంగా ఆక‌ట్టుకుంటుంది. ఇంత బ‌డా సైజు క్రికెట్ గ్రౌండ్ హైద‌రాబాద్‌లోని అతిపెద్ద గేటెడ్ క‌మ్యూనిటీల్లోనూ లేదంటే అతిశ‌యోక్తి కాదు.

This website uses cookies.