సార్, నేను కొల్లూరులో ఒక ఆదిత్రి ఎంపైర్ ప్రాజెక్టును చూశాను. మొదటి ఫేజుకు రెరా అనుమతి లభించింది. కానీ, బిల్డర్ సెకండ్ ఫేజు ఫ్లాట్లు అమ్ముతున్నాడు. చదరపు అడుక్కీ రూ.4299గా చెబుతున్నారు. ఇందులో నేను ఫ్లాట్ కొనవచ్చా? ఫణీ, ఐటీ ఉద్యోగి
తెలంగాణ రెరా అథారిటీ నిబంధనల ప్రకారం.. రెరా అనుమతి తీసుకున్నాకే ఫ్లాట్లను విక్రయించాలి. ఏ ఫేజుకు అనుమతి లిభించిందో అందుకు సంబంధించిన ఫ్లాట్లనే డెవలపర్ అమ్మాలి. కానీ, మీరు చెబుతున్న ప్రాజెక్టులో రెరా నిబంధనలకు వ్యతిరేకంగా డెవలపర్ సెకండ్ ఫేజులో విక్రయిస్తున్నారని అర్థమవుతోంది. వీలైనంత వరకూ రెరా అనుమతి ఉన్న వాటినే కొనడం ఉత్తమం.
సార్, నేను ఫ్లాట్ కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. పలువురు ఏజెంట్లు కొన్ని ఫ్లాట్లను నాకు చూపిస్తున్నారు. రెండు శాతం కమిషన్ తీసుకుంటామని చెబుతున్నారు. ఇవన్నీ స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లే. మరి, ఈ ఏజెంట్లు చూపెట్టే ఫ్లాట్లను నేను కొనొచ్చా? – రాజేశ్వర్ రావు, బాచుపల్లి
500 గజాలకు పైగా విస్తీర్ణంలో ఎనిమిది లేదా అంతకుమించి ఫ్లాట్లను కట్టే ప్రతి అపార్టుమెంట్ రెరా పరిధిలోకి వస్తుంది. మీరు చెబుతున్నది కొత్త అపార్టుమెంట్ కాబట్టి, ముందుగా దానికి రెరా అనుమతి ఉందో లేదో కనుక్కోండి. ఫ్లాట్లను విక్రయించే ఏజెంటూ రెరా కింద నమోదు కావాలి. కాబట్టి, ఈ రెండు అంశాల్ని గమనించాకే తుది నిర్ణయానికి రండి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు చేరువలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక అపార్టుమెంట్ కొనాలని ఉంది. టూ బెడ్రూమ్ బడ్జెట్ 60 లక్షలు. ట్రిపుల్ బెడ్ రూం.. 75 లక్షలు. నా ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? నానీ, మాదాపూర్ అరవై లక్షల్లోపు రెండు పడక గదుల ఫ్లాట్లు చాలానే లభిస్తున్నాయి. తెల్లాపూర్, నార్సంగి,కొల్లూరు, ఉస్మాన్ నగర్ వంటి ప్రాంతాల్లో కొంచె అటుఇటుగా మీకు దొరుకుతాయి. తెల్లాపూర్‌లోని ఉస్మాన్ నగర్‌లో రెడీ టు ఆక్యుపై 1210 చదరపు అడుగుల్లో ఒక ఫ్లాట్ లభిస్తుంది. కాకపోతే ధర రూ.63 లక్షలు చెబుతున్నారు. ఇది గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. తెల్లాపూర్‌లో ఒక ప్రాజెక్టులో రెండు పడక గదుల ఫ్లాట్ రూ.75 లక్షలు అంటున్నారు. అదే గోపనపల్లిలో అయితే 77 లక్షలకు డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ వస్తుంది. ఇక, అల్కాపురి టౌప్ లో మీకు చదరపు అడుక్కీ కొన్ని సంస్థలు రూ.5,500 కే విక్రయిస్తున్నారు. నార్సింగిలో రూ.5400కే స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్ ఉంది. అమెనిటీస్ కోసం రూ.4 లక్షలు ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది.