Categories: LATEST UPDATES

వ‌ర్షాకాలంలో.. పాలిష్ చేయిస్తారా?

వ‌ర్షాలు ప‌డుతున్నాయంటే చాలామందిలో ఒక‌టే టెన్ష‌న్‌. ఎక్క‌డ వ‌ర్షం ఇంట్లోకి చేరుతుందో.. ఫ‌ర్నీచ‌ర్ పాడు చేస్తుంద‌నో.. ఆలోచిస్తుంటారు. మ‌రి, మీరు కూడా ఇలాగే ఆలోచిస్తుంటే.. ఇదిగో మీరు వ‌ర్షాకాలం కి ఇలా స‌న్న‌ద్ధం కావాలి. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చీకూచింతా లేకుండా వానాకాలాన్ని గడిపేయ‌వ‌చ్చు.

  • మీ ఔట్ డోర్ లో ఏర్పాటు చేసుకున్న సీటింగ్ ను పరిశీలించండి. తడిచినా పాడు కానీ సీట్లు అయితే పర్లేదు.. లేకుంటే వాటిని మార్చండి.
  • మీ ఇంటి కిటికీలు, తలుపులు చెక్ చేసి ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో పరిశీలించండి. అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే డ్యామ్ ప్రూఫ్ చేయించండి.
  • వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే నీళ్లు లీక్ అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్ని గుర్తించి వాటిని స‌రి చేయించండి.
  • డోర్ల వద్ద యాంటీ స్కిడ్ మ్యాట్ లు మాత్రమే వినియోగించాలి.
    తలుపులు, కిటికీలకు భారీ కర్టెన్లు వాడొద్దు. పలుచని కాటన్ కర్టెన్లు వానాకాలానికి అనువుగా ఉంటాయి.
  • వర్షాకాలంలో ఫ్లోర్ పై రగ్గులు, కార్పెట్లు వాడొద్దు.
  • లెదర్ వస్తువులు కూడా కొనవ‌ద్దు. వర్షాకాలంలో అవి పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • మీ ఇంట్లో లెదర్ సోఫాలు ఉంటే.. వాటికి కవర్లు వేయండి.
  • వర్షాకాలంలో ఇంటికీ రీపెయింట్ వేయించకూడ‌దు. అలా వేస్తే అది ఎంతోకాలం ఉండదు.
    ఫర్నిచర్ కు పాలిష్ చేసే పని కూడా వర్షాకాలంలో వద్దు.

This website uses cookies.