Categories: TOP STORIES

కేంద్ర బడ్జెట్ లో..  కొన్ని కీలకాంశాలివే!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో 2023-24కి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మౌలిక వసతులతోపాటు రియల్ ఎస్టేట్ కు ఉపకరించేలా బడ్జెట్ రూపొందించినట్టు నిర్మల చెప్పారు. మరి, ఆమె బడ్జెట్లో ఏయే అంశాల‌పై ఎక్కువగా ఫోక‌స్ పెట్టార‌నే అంశాన్ని రెజ్ న్యూస్ పాఠ‌కుల‌కు ప్ర‌త్యేకంగా వివ‌రిస్తున్నారు.. పౌలోమీ ఎస్టేట్స్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ రావు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజన బడ్జెట్ ను ఏకంగా 66 శాతం పెంచి, రూ.79 వేల కోట్లు కేటాయించారు.
* రెసిడెన్షియల్ ప్రాపర్టీలపై కేపిటల్ గెయిన్స్ రాయితీపై సెక్షన్ 54, 54 ఎఫ్ కింద రూ.10 కోట్ల పరిమితి విధించారు.
* జాయింట్ ప్రాపర్టీ డెవలప్ మెంట్ విషయంలో కేపిటల్ గెయిన్స్ లెక్కింపునకు కొన్ని మార్గదర్శకాలు ప్రతిపాదించారు.
* పట్టణ వసతులపై యూజర్ ఛార్జీలను రింగ్ ఫెన్సింగ్ చేయడం, ఆస్తి పన్నుపై పాలన సంస్కరణలు అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీలు తమ రుణ యోగ్యతను మెరుగుపరుచుకోవాలి.
* ఆర్ఐడీఎఫ్ తరహాలో ప్రాధాన్యత రంగ రుణాలను కొరతను అధిగమించడం ద్వారా అర్బన్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ ఏర్పాటు అవుతుంది. దీనిని నేషనల్ హౌసింగ్ బ్యాంకు నిర్వహిస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లో పట్టణ వసతుల ఏర్పాటుకు ఈ నిధిని వినియోగిస్తారు. ఈ నిధి ద్వారా ఏటా రూ.10 వేల కోట్లు అందుబాటులో ఉంచుతారు.
* రైల్వే, రోడ్లు సహా మౌలిక వసతులు, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్ ఫ్రాస్టక్చర్ ఫైనాన్స్ సెక్రటేరియట్ సహకరిస్తుంది.
* నగరాలను రేపటి స్థిరమైన నగరాలుగా అభివృద్ధి చేసేందుకు పట్ణణ ప్రణాళికల్లో సంస్కరణలను ప్రోత్సహిస్తారు. సమర్థవతంగా భూ వనరుల వినియోగం, మౌలిక వసతులకు చాలినంత వనరులు, రవాణా అభివృద్ధి, అందుబాటులో పట్టణ భూ వనరులు, అందరికీ అవకాశాలు అనేవి ఇందులో ఉంటాయి.
* నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో హౌసింగ్, ప్లానింగ్, డెవలప్ మెంట్ తదితరాల కోసం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థ లేదా బోర్డు లేదా ట్రస్టు లేదా కమిషన్ కు వచ్చే ఎలాంటి ఆదాయంపై అయినా పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.

This website uses cookies.