Categories: TOP STORIES

ఎనిమిదిన్న‌రేళ్ల‌లో ఎంతో అభివృద్ధి!

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్

  • 8.5 ఏళ్ల‌లో ఆక‌ర్షించిన పెట్టుబ‌డులు: 3.31 ల‌క్ష‌ల కోట్లు
  • 140 శాతం వృద్ధి చెందిన ఐటీ నియామ‌కాలు
  • ప‌ట్ట‌ణాభివృద్దిలో తెలంగాణ‌కు అనేక అవార్డులు
  • 7.7 శాతం పెరిగిన గ్రీన్ క‌వ‌ర్‌
  • ట్రీ సిటీ ఆఫ్ ద వ‌ర‌ల్డ్‌గా న‌గరానికి గుర్తింపు
  • రాష్ట్ర ఆదాయం 62000 కోట్ల నుంచి
    రూ. 1.84 ల‌క్ష‌ల‌కు పెరుగుద‌ల‌
  • బడ్జెట్ ప్ర‌సంగంలో ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌ : తెలంగాణ న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో తాగునీటి స‌మ‌స్య‌లు తొల‌గిపోయాయి. విద్యుత్తు కోత‌లు పెద్ద‌గా లేవు. ఉద్యోగాలు పెరిగాయి. ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ప‌ట్ట‌ణాల్లో పారిశుద్ధ్య ప్ర‌మాణాలు రెట్టింప‌య్యాయి. ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించే కార్య‌క్ర‌మం ఒక య‌జ్ఞంలా జ‌రుగుతోంది. రాష్ట్రం ఆర్థికంగా గ‌ణ‌నీయంగా వృద్ధి చెందుతోంది. మొత్తానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ నాటి నుంచి సర్వతోముఖాభివృద్ధి చెందుతోంద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ తెలిపారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి చేసిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆమె తెలంగాణ రాష్ట్రం పురోగ‌తి చెందుతుందంటూ ప‌లు అంశాల్ని ప్ర‌స్తావించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోని ముఖ్య‌మైన అంశాలు ఏమిటంటే..

తెలంగాణ పట్టణాల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు పెరిగాయి. పురపాలక సంస్థల పనితీరు మెరుగపడింది. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, పెద్ద సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, శ్మశానాలను ఆధునిక వసతులు కలిగిన వైకుంఠధామాలుగా మార్చడం వంటి అనేక మౌలిక వసతుల్ని ప్రభుత్వం కల్పించింది. ఉత్తమ పనితీరు గల నగరాలు, పట్టణాల విభాగంలో కేంద్రం అనేక అవార్డుల్ని ఇటీవల ప్రకటించింది. 26 అవార్డులతో తెలంగాణ పనితీరును అత్యుత్త‌మంగా కనబర్చింది. దక్షిణ రాష్ట్రాలకు ఇచ్చిన 75 శాతం అవార్డులను తెలంగాణ కైవసం చేసుకుంది.

పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఒక పవిత్ర యజ్ఞంలా కొనసాగిస్తున్నది. తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా గుర్తింపును పొందింది. పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యల్ని చేపట్టింది. గత ఎనిమిదిన్నరేండ్లుగా పారిశ్రామిక మరియు ఐటీ రంగాల్లో 3 లక్షల 31 వేల కోట్లకు పైగా పెట్టుబడుల్ని తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. ఐటీ ఉద్యోగుల నియామకాల్లో 140 శాతం వృద్ధి చెందింది.
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం ఒక పవిత్ర యజ్నంలా కొనసాగిస్తున్నది. తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా గుర్తింపును పొందింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉండగా.. ప్రభుత్వ కృషి వల్ల 2021 నాటికి లక్షా 84 వేల కోట్లకు పెరిగింది. 2014లో తలసరి ఆదాయం 1,24,104 ఉండగా.. 2022-03 నాటికి 3,17,115కి చేరింది.
దేశంలోనే ఇరవై నాలుగు గంటలు విద్యుత్తును అందజేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కింది. రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతికి ఇది ప్రబలమైన సూచిక అని చెప్పొచ్చు. 2014లో రాష్ట్ర స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే ఉండేది. నేడు 18,453 మెగావాట్లకు చేరింది.
తాగునీటి కష్టాలకు సంపూర్ణమైన ముగింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మిషన్ భగీరథ బృహత్తర ప్రణాళికతో రాష్ట్రంలోని నూటికి నూరుశాతం ఆవాసాలకూ సురక్షితమైన తాగునీరు సరఫరా అవుతున్నది. ఫ్లోరైడ్ పీడ సంపూర్ణంగా అంతమైపోతుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పార్లమెంటు వేదికగా ప్రకటించింది.

This website uses cookies.