భారత నిర్మాణ రంగానికి మార్గదర్శి.. క్రెడాయ్
క్రెడాయ్ 22వ ఎడిషన్ నాట్‌కాన్
ఈసారి ఆస్ట్రేలియాలోని సిడ్నిలో
తేదీలు: సెప్టెంబరు 23- 26 @ సిడ్నీ
దేశవ్యాప్తంగా 1200 డెలిగేట్స్ హాజరు
(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
దేశీయ నిర్మాణ రంగంలో.. పాతికేళ్ల క్రితం ఆరంభమైన క్రెడాయ్.. ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా.. 21 రాష్ట్రాలకు విస్తరించింది. సుమారు 230కి పైగా నగరాల్లో.. 13 వేలకు పైగా బిల్డర్లకు దిక్సూచీగా వ్యవహరిస్తోంది. నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాల్ని చూపెడుతూ.. రియల్ రంగానికి సంబంధించిన పాలసీ రూపకల్పనలో క్రియాశీలకంగా మారుతూ.. సాటి డెవలపర్లకు సరికొత్త పోకడల్ని వివరిస్తూ.. ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానాల్ని పరిచయం చేస్తూ.. వ్యవసాయం తర్వాత అధిక శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పించే స్థాయికి.. భారత నిర్మాణ రంగం ఎదిగేందుకు దోహదపడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత.. క్రెడాయ్‌కే దక్కుతుంది. మరి, ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ సంబరాల్ని ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ఉత్సాహభరితంగా జరుపుకునేందుకు సిద్ధమైంది.
క్రెడాయ్ నేషనల్ సాధించిన ఎచీవ్‌మెంట్స్.. ఫ్యూచర్ ప్లానింగ్.. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న సరికొత్త మార్పులు, ఆధునిక నిర్మాణ పోకడలు, మోడ్రన్ టెక్నాలజీలపై అభిప్రాయాలను పంచుకోవడానికి.. ప్రతి ఏటా నిర్వహించే వార్షిక మహోత్సవాన్ని.. ఈసారి ఆస్ట్రేలియా వేదికగా క్రెడాయ్ నిర్వహిస్తోంది. ఇందుకు నాట్‌కాన్ 22వ ఎడిషన్‌కు సిడ్నీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక అవుతోంది. సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా కావడంతో నాట్‌కాన్ ట్వంటీ సెకండ్ ఎడిషన్ వెరీ వెరీ స్పెషల్‌గా నిలుస్తోందని చెబుతోంది క్రెడాయ్ కర్ణాటక. మరి, భారతదేశానికి చెందిన నిర్మాణ దిగ్గజాలు పాల్గొంటున్న ఈసారి ఈవెంట్ ఎంత అట్రాక్ట్‌గా ఉండనుంది? రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.
క్రెడాయ్ (కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌కు అపెక్స్ బాడీగా వ్యవహారిస్తోంది. క్రెడాయ్.. బిల్డింగ్ ద నేషన్ అంటూ 1999లో ప్రారంభమై 25 ఏళ్లుగా భారత నిర్మాణ రంగానికి తనవంతు సేవల్ని అందిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ దానికి తగ్గట్టు అంతర్జాతీయంగా నిర్మాణ రంగంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు కావాల్సిన సలహాలు సూచనలు ఇస్తూ ఈ రంగం మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా పని చేస్తుంది క్రెడాయ్.
సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా కావడంతో న్యాట్‌కాన్- 2024 క్రెడాయ్‌కు చాలా స్పెషల్. ఈ నెల 23 నుంచి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి సిడ్నీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్, ప్రభుత్వాధికారులు, ఫైనాన్స్- బ్యాంకింగ్ సెక్టార్‌కు చెందిన లీడర్స్, ఇన్వెస్టర్లు, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన దాదాపు 1200 మందికి పైగా డెలిగేట్స్ నాట్‌కాన్ 22వ ఎడిషన్‌కు హజరవుతారనే అంచనాలున్నాయ్. రియల్ ఎస్టేట్ సెక్టార్‌కు చెందిన దిగ్గజాల కీలక ప్రసంగాలు, ప్యానెల్ డిస్కషన్స్, ఇన్నోవేటివ్ వర్క్‌షాప్స్ ఎగ్జిబిషన్ ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతాయి.
నాట్‌కాన్ 22వ ఎడిషన్‌లో ఇండియన్ రియాల్టీ సెక్టార్ రోడ్ మ్యాప్‌తో పాటు వన్ ట్రిలియన్ దిశగా పరుగులు పెడుతున్న మార్కెట్ పరిమాణం, వికసిత భారత్‌లో భాగంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు- వాటికి ఎదురవుతున్న సమస్యలు, భారతీయ ఆర్థిక వ్యవస్థ- ఉపాధి కల్పనలో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర, రియాల్టీ సెక్టార్‌లో స్టార్టప్ స్టోరీస్, ఏఐ, వీఆర్ లాంటి టెక్నాలజీతో నిర్మాణ రంగంలో మార్పులు- విప్లవాలు, రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు మొదలైన టాపిక్స్‌పై చర్చలు జరుగుతాయి.
రియల్ ఎస్టేట్- ఇన్ఫ్రాస్ట్రక్చర్- ఒకదాని అభివృద్ధి మరో రంగంపై ఆధారపడి ఉన్నాయ్. అందుకే క్రెడాయ్ కేవలం రియల్ ఎస్టేట్ రంగానికే పరిమితం కాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి కావాల్సిన సహాయ సహకారాలు.. సమాచారం సైతం అందిస్తుంది. ఎలాంటి పద్ధతులు అనుసరిస్తే మౌలిక రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందో.. నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పద్ధతుల గురించి ప్రభుత్వాలకు నివేదికల్ని క్రెడాయ్ అందజేస్తుంది.
ఇండియాలోని దాదాపు 21 రాష్ట్రాల్లోని 230కి పైగా నగరాలకు చెందిన 13 వేల 300 మందికి పైగా డెవలపర్స్ క్రెడాయ్ నేషనల్‌లో సభ్యులుగా ఉన్నారు. క్రెడాయ్ నేషనల్ సెక్రటేరియట్ ఢిల్లీలో ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో జెండర్ న్యూట్రల్‌గా చేయడమే తమ లక్ష్యమంటోన్న క్రెడాయ్- ఇటు యూత్ వింగ్‌తో పాటు ఉమెన్ వింగ్‌ను కూడా ఏర్పాటు చేసింది. సభ్యులకు ప్రపంచ నిర్మాణ పరిశ్రమలో తాజా పోకడలు, ఆధునిక సాంకేతికతను అందించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం బొమన్ ఇరానీ క్రెడాయ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తుండగా.. మనోజ్ గౌర్ ఛైర్మన్‌గా ఉన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా శేఖర్ పటేల్, క్రెడాయ్ నేషనల్ సెక్రటరీగా తెలంగాణకు చెందిన ఆర్క్ గ్రూప్ అధినేత గుమ్మి రాంరెడ్డి వ్యవహరిస్తున్నారు.
వెతికి చూడాలే కానీ కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఎన్నో అవకాశాలు. ఇప్పటికే దిగ్గజాలుగా ఎదిగిన కంపెనీలకు తోడు ఫ్యూచర్‌లో ఈ రంగంలోకి రావాలని ఆశపడే యంగ్ జనరేషన్‌ను రైట్ డైరెక్షన్‌లో నడిపించడానికి క్రెడాయ్ వంతు కృషి చేస్తుంది. అంతేకాదు కస్టమర్లకు ఉండే అపోహలు తొలగిస్తూ.. ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరిస్తూ రియల్ ఎస్టేట్ రంగంపై నమ్మకం- భరోసాని కల్పించే బాధ్యతలు కూడా తీసుకుంది. క్రెడాయ్- కేవలం రియల్ ఎస్టేట్ సెక్టార్.. నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం కాలేదు. ఓ వైపు సీఎస్సార్ కార్యకలాపాలతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విరాళాలు అందిస్తూ సామాజిక బాధ్యతలోనూ తన వంతు పాత్ర పోషిస్తుంది. మరి, 25 వసంతాలు పూర్తి చేసుకుని కొత్త ఉత్సాహంతో ఉన్న క్రెడాయ్- సిడ్నీలో నిర్వహించే న్యాట్‌కాన్ గ్రాండ్ సక్సెస్ కావాలని.. ఈ కార్యక్రమం వల్ల భారత నిర్మాణ రంగానికి గొప్ప ప్రయోజనం చేకూరాలని మనసారా కోరుకుందాం.
This website uses cookies.