విశాలమైన విస్తీర్ణంలో బడా విల్లాలో నివసిస్తూ.. స్విమ్మింగ్ పూల్, మోడ్రన్ జిమ్ వంటి ఆధునిక సదుపాయాల్ని ఆస్వాదిస్తూ.. ప్రకృతిలో సేదతీరాలని చాలామంది కోరుకుంటారు. కాకపోతే, ఎక్కడో దూరంగా వెళితే తప్ప సాధ్యం కాదని భావిస్తుంటారు. కాకపోతే, ఇందుకోసం మీరు ఎక్కడికో వెళ్లక్కర్లేదు. అత్తాపూర్‌లోనే ఒక మహత్తరమైన ప్రీమియం విల్లా కమ్యూనిటీని ప్రణవా గ్రూప్ ఆరంభించింది. దీనికి గ్రీన్ విచ్ విల్లా అని నామకరణం చేసింది. ఈ ప్రాజెక్టు విశిష్ఠతలను తెలుసుకుంటే.. మీరు ఎగిరి గంతేస్తారని చెప్పొచ్చు.
ప్రణవా గ్రూప్.. ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా.. తమ ప్రత్యేకతను చాటి చెబుతుంది. ఈ విషయాన్ని గ్రీన్ విచ్ విల్లా ప్రాజెక్టు డిజైన్ చూస్తేనే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దాదాపు 9.13 ఎకరాల్లో.. ఈస్ట్, నార్త్, వెస్ట్ ఫేసింగ్ గల 90 విల్లాలను తీర్చిదిద్దుతోంది. గ్రీన్ విచ్ విల్లాస్ ప్రత్యేకత ఏమిటంటే.. ప్రత్యేకంగా హెర్బల్ గార్డెన్, వెజిటేబుల్స్ గార్డెన్లు వంటివి తీర్చిదిద్దుతారు. పచ్చని చెట్ల మధ్య మెడిటేషన్ ఏరియా, సీనియర్ సిటిజెన్స్ డెక్, రిఫ్లెక్సాలజీ పాత్‌వే వంటి వాటికి స్థానం కల్పించారు. యాంఫీ థియేటర్, ఔట్‌డోర్ ప్లే ఏరియా, క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్, హాఫ్ బాస్కెట్ బాల్ కోర్టు, స్కేటింగ్ రింక్ వంటి వాటికి పెద్దపీట వేశారు.
అత్తాపూర్ మెయిన్ రోడ్డు నుంచి కేవలం ఒక నిమిషంలో గ్రీన్ విచ్ విల్లాస్ కు చేరుకోవచ్చు. ఇక్కడ్నుంచి ఆస్పత్రులకు రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు. మూడు నిమిషాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లొచ్చు. హైటెక్ సిటీకి మహా అయితే 15 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.
This website uses cookies.