హైదరాబాద్ నగరానికి చెందిన ప్రణవా గ్రూప్.. ఆరంభం నుంచీ నిర్మాణాల్లో తమ వైవిధ్యాన్ని చాటి చెబుతోంది. అటు రెసిడెన్షియల్ ఇటు వాణిజ్య కట్టడాల్లో ప్రత్యేకతను నిరూపిస్తోంది. ప్రతి నిర్మాణం వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్తలను తీసుకుంటుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రణవా గ్రూప్ కేవలం నిర్మాణాలే కాకుండా.. రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందించాలన్న ఉద్దేశ్యంతో.. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లను డెవలప్ చేస్తోంది. నాలుగైదేళ్ల క్రితం యాదగిరిగుట్టలో నాటింగ్ హిల్ అనే వెంచర్‌ను అత్యుత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయడం వల్ల.. అందులో ప్లాట్లు కొన్నవారు 2-3 రెట్లు అప్రిసీయేషన్‌ను అందుకున్నారు. కొందరు కొనుగోలుదారుల అభ్యర్థన మేరకు.. ప్రణవా గ్రూప్.. యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డులో తాజాగా టెంపుల్ స్క్వేర్ అనే సరికొత్త గేటెడ్ ప్లాటింగ్ వెంచర్‌కి శ్రీకారం చుట్టింది.
ప్రణవా గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే.. అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాల్లోనే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. ముఖ్యంగా, ప్రధాన రహదారుల్లోనే తమ వెంచర్లు ఉండేలా ప్రణాళికలను రచిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ నగరానికి నడిబొడ్డులో.. ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ప్రణవా వన్ హైదరాబాద్ అనే రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఎక్కడ నిర్మాణాన్ని ఆరంభించినా స్థానిక సంస్థల అనుమతుల్ని పక్కాగా తీసుకున్నాకే అడుగు ముందుకేస్తుంది. టెంపుల్ స్క్వేర్ వెంచర్ కు వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ), రెరా అనుమతి తీసుకున్నాకే ప్రకటించింది. ఈ వెంచర్‌ను దాదాపు 21 ఎకరాల్లో అభివృద్ధి చేస్తోంది.
This website uses cookies.