Categories: PROJECT ANALYSIS

బాచుప‌ల్లిలో భ‌లే ప్రాజెక్టు.. ప్ర‌ణీత్ ప్ర‌ణ‌వ్ టౌన్ స్క్వేర్‌

బాచుప‌ల్లి ప్రాంతానికి గ‌ల భ‌విష్య‌త్తు అభివృద్ధిని ప‌క్కాగా అంచ‌నా వేసిన సంస్థ‌ల్లో ప్ర‌ణీత్ ప్రాజెక్ట్స్ ముందంజ‌లో నిలుస్తుంది. అస‌లు ఏ సంస్థా ఊహించ‌ని రోజుల్లోనే.. ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌ల్ని అర్థం చేసుకుని.. రానున్న రోజుల్లో సాక్షాత్క‌రించే వృద్ధిని ఆనాడే ఆక‌ళింపు చేసుకుని.. ప్ర‌ణీత్ ప్రాజెక్ట్స్ బాచుప‌ల్లి కేంద్రంగా ప‌లు ప్రాజెక్టుల‌కు రూప‌క‌ల్ప‌న చేసింది. ఈ సంస్థ వ‌ద్ద ఇప్ప‌టికే స్థిర నివాసాన్ని కొన్న‌వారు.. పెరిగిన త‌మ ఆస్తి విలువ‌ను చూసి మురిసిపోతున్నారు.

అందుకే, ప్ర‌ణీత్ ఎక్క‌డ ప్రాజెక్టుల్ని ప్రారంభించినా.. వీళ్లే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఫ‌లితంగా పెద్ద‌గా మార్కెటింగ్ అవ‌స‌రం లేకుండానే.. ప్ర‌ణీత్ గ్రూప్ త‌మ ప్రాజెక్టుల్ని వేడి ప‌కోడిల్లా విక్ర‌యిస్తుంది. ఇంత‌టి ఘ‌న‌మైన ట్రాక్ రికార్డు గ‌ల ఈ సంస్థ తాజాగా ఓ ఫ్యూచ‌రిస్టిక్ ప్రాజెక్టును ప్రారంభించింది. అదే.. ప్ర‌ణీత్ ప్ర‌ణ‌వ్ టౌన్ స్క్వేర్‌. దీనికి ఐజీబీసీ సిల్వర్ ప్రీ సర్టిఫికేషన్ కూడా లభించడం విశేషం. ఈ ప్రాంతంలో ఐజీబీసీ సర్టిఫికేషన్ పొందిన ప్రప్రథమ ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం.

బాచుపల్లిలో హెచ్ఎండీఏ అనుమతి పొంది.. రెరా ఫైనల్ అప్రూవల్ తీసుకున్న ప్రప్రథమ ప్రాజెక్టే.. ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. రెండు, మూడు పడక గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఇందులో టూ బెడ్రూమ్ ఫ్లాటు 1160 చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి, మూడు పడక గదులఫ్లాట్లేమో.. 1494 నుంచి మొదలవుతాయి. మొత్తం ఐదు వందల ఇరవై ఏడు ఫ్లాట్లను అభివృద్ధి చేస్తోంది. కాంటెపరరీ ఆర్కిటెక్చర్ కు పెద్దపీట వేయ‌డం వ‌ల్ల ఫ్లాటు కొన్న‌వారు ప్రశాంతంగా నివ‌సించొచ్చు. నాలుగు టవర్లలో ఒక్కోటి ఐదు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. నివాసితులు సులువుగా పార్కింగ్ చేసే సౌలభ్యాన్ని కల్పించారు. ఇతర అపార్టుమెంట్ల తరహాలో ఎక్కడపడితే అక్కడ పిల్లర్లు కనిపించవు. ఇందుకోసం సంస్థ దాదాపు రూ.10 కోట్ల కంటే ఎక్కువ మొత్తన్ని మెరుగైన పార్కింగ్ వ్యవస్థను అందించడానికే వెచ్చించింది.

ఫుల్లీ సెక్యూర్డ్..

ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్లో ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట వేసింది. మోడ్ర‌న్‌ క్లబ్ హౌజ్ ఏర్పాటు చేస్తోంది. స్విమ్మింగ్ పూల్, మోడ్రన్ జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు వంటివి డెవలప్ చేస్తోంది. చిన్నారులు ఆడుకునేందుకు ప్లే ఏరియాలు, ఇండోర్ గేమ్స్, యోగా, మెడిటేషన్ ఏరియా, షాపింగ్ సెంటర్ వంటి వాటికి స్థానం క‌ల్పించింది. ఇందులో నివసించేవారి భద్రత కోసం ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ పహారా కాస్తుంది. పైగా సీసీ టీవీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ఇక, ఇందులో నివసించేవారు ఎలాంటి సంబురాల్ని అయినా బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా రెండు మల్టీ పర్పస్ హాల్స్ ను పొందుపరిచారు. తివాచిపర్చిన పచ్చదనం తో కూడుకున్న ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, సోలార్ లైటింగ్, పైప్డ్ గ్యాస్, వెయిటింగ్ లాంజ్, క్రెష్, డే కేర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. బాచుపల్లిలో డెవలప్ చేస్తున్న ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్వ్కేర్ కు సులువుగా రాకపోకలను సాగించొచ్చు. ఇందుకోసం ఒకవైపు మియాపూర్ మెట్రో స్టేషన్, మరోవైపు జేఎన్టీయూ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్, ఫార్మా రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్లకు సులువుగా రాకపోకలను సాగించొచ్చు. పైగా, అంతర్జాతీయ విమానాశ్రాయానికి ఎంచక్కా ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి వెళ్లిపోవచ్చు.

ఎడ్యుకేష‌న్ హ‌బ్‌..

బాచుపల్లిని ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పొచ్చు. కేజీ నుంచి పీజీ వరకూ అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించే ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఇక్కడ కొలువు దీరాయి. ఉదాహరణకు, అంతర్జాతీయ స్కూళ్లు అయిన సిల్వర్ ఓక్స్, కెన్నెడి, స్లేట్, ఓక్రిడ్జ్‌, క్రీక్‌, యాంబిట‌స్‌, ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌, ప్రణీత్ వారి అకడ‌మిక్ హైట్స్‌ వంటివి చాలానే ఉన్నాయి. శ్రీ చైతన్య నారాయణ వంటి ఇంటర్ కళాశాలలు, వీఎన్ఆర్ విజ్ణాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. అత్యవసరాల్లో ఎస్ ఎల్ జీ ఆస్ప‌త్రి, మ‌మ‌తా మెడిక‌ల్ సైన్సెస్‌, శ్రీ శ్రీ హోలిస్టిక్ వంటి ఆస్ప‌త్రులున్నాయి. ప్ర‌ణీత్ ప్ర‌ణ‌వ్ టౌన్ స్క్వేర్ ప్రాజెక్టులో అన్ని ర‌కాల ఫ్లాట్ల‌కు సంస్థ పెద్ద పీట వేసింది. హ‌రిత సూత్రాల‌కు అనుగుణంగా డిజైన్ చేసిన ప్రాజెక్టు కావ‌డం వ‌ల్ల‌.. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందుల్లేని, బాద‌రాబాందీల్లేని జీవితాన్ని ఇక్క‌డ ఆస్వాదించ‌వ‌చ్చు. కాబ‌ట్టి, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు ఏమాత్రం ఆలోచించ‌కుండా.. బాచుప‌ల్లి మెయిన్ రోడ్డు మీదే ఉన్న ప్ర‌ణీత్ ప్ర‌ణ‌వ్ టౌన్ స్క్వేర్ లో నేడే మీకు న‌చ్చిన ఫ్లాటును బుక్ చేయండి.

(బాక్స్‌)

పేరు: ప్ర‌ణీత్ ప్ర‌ణ‌వ్ టౌన్ స్క్వేర్‌
ప్ర‌త్యేక‌త‌: ఐజీబీసీ సిల్వ‌ర్ ప్రీ స‌ర్టిఫైడ్
ఎక్క‌డ‌? బాచుప‌ల్లి
స్థ‌ల విస్తీర్ణం: 6 ఎక‌రాలు
మొత్తం ఫ్లాట్లు: 527
ఏ ర‌కం: 2, 2.5, 3 బీహెచ్ కే ఫ్లాట్లు

This website uses cookies.