ప్రీలాంచ్ లేదా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ప్రజల దగ్గర ముందే కొందరు ప్రబుద్ధులు సొమ్ము లాగేస్తున్నారు. మొదట్లో తక్కువ రేటు అంటున్నారు.. లక్ష లేదా రెండు లక్షలు చెల్లించి ఫ్లాట్ బుక్ చేస్తే చాలంటున్నారు. రెరా అనుమతి లభించాకే మిగతా సొమ్ము కడితే సరిపోతుందని బుకాయిస్తున్నారు. మరి, ఆ లక్ష లేదా రెండు లక్షలు కూడా ఎందుకు వసూలు చేస్తున్నారంటే.. కమిట్‌మెంట్ కోసం తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఇలాగే బండ్లగూడలో దిగాడో ప్రబుద్ధుడు. చదరపు అడుక్కీ రూ.3,100కే ఫ్లాట్లు అంటూ సరికొత్త ప్రీలాంచ్ డ్రామాకు తెరలేపారు. రెరా అనుమతి లభించాకే మిగతా సొమ్ము చెల్లించమని కొనుగోలుదారులకు చెబుతున్నాడు. వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న ఈ ప్రీలాంచ్ మెసేజ్ ను క్లిక్ చేస్తే.. ఎస్ఎం కన్‌స్ట్రక్షన్స్ అని చూపెడుతుండటం గమనార్హం.
బండ్లగూడలో ఇంతవరకూ ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించిన బిల్డర్ లేడంటే నమ్మండి. మరి, ఇతనెవరో కొత్తగా అపార్టుమెంట్లను ఆరంభించినట్లు కనిపిస్తుంది. ఈ బిల్డర్‌కు అపార్టుమెంట్లను కట్టడంలో అనుభవం ఉందో లేదో తెలియదు కానీ.. ప్రజల నుంచి అయితే ముందు సొమ్ము వసూలు చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నాడు. కాబట్టి, కొనుగోలుదారులు జాగ్రత్తగా ఆలోచించి.. ఆచితూచి అడుగులేయాలి. రేటు తక్కువే ఉండొచ్చు.. అతను కడితే కదా ఫ్లాట్ మీ చేతికొచ్చేది. అపార్టుమెంట్ కట్టకుండా కాలయాపన చేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే అడుగు ముందుకేయండి.
This website uses cookies.