మియాపూర్ కేంద్రంగా పని చేసే మైత్రీ ప్రాజెక్ట్స్.. దాదాపు మూడు వందల మంది నుంచి రూ.50 కోట్లను వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఫలితంగా, ఇందులో ప్లాట్లు కొన్నవారంతా రోడ్డు మీద పడ్డారు. ఈ సంస్థ ఆరంభించిన మూడు వెంచర్లలో.. రాయల్ ప్యారడైజ్, రాయల్ లీఫ్ కు హెచ్ఎండీఏ ప్రాథమిక అనుమతి లభించింది. రాయల్ మింట్ కు అనుమతి లేదు. అయితే, ప్రీలాంచ్‌లో రేటు తక్కువనేసరికి.. చాలామంది వేలంవెర్రిలా ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోయారు. ఇప్పుడేమో వీ వాంట్ జస్టీస్ అంటూ పోలీసు స్టేషన్ల వరకూ ర్యాలీ తీసినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే, రెరా అనుమతి ఉన్నవాటిలోనే కొనాలని రియల్ ఎస్టేట్ గురు నిత్యం కొనుగోలుదారుల్ని అప్రమత్తం చేస్తోంది. అయినా, రేటు తక్కువనే అత్యాశతో ప్లాట్లను కొని చాలామంది అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వం కూడా రెరాను పటిష్ఠపర్చడంలో పూర్తిగా విఫలమైంది. అందుకే, ఇలాంటి రియల్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం ప్రీలాంచ్ వ్యవహారంలో మనం గమనించాల్సిన అంశాలేమిటంటే..
యోషితా ఇన్‌ఫ్రా అనే సంస్థ మియాపూర్ కేంద్రంగా పని చేస్తోంది. ఈ సంస్థ ఎండీ కమలాకర్ గుంటూరు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను హైదరాబాద్‌లో ప్రీలాంచ్ జోరుగా జరుగుతుందని తెలుసుకున్నాకే.. మియాపూర్‌లో ఆఫీసు తీసుకుని ప్రీలాంచ్ దందాకు శ్రీకారం చుట్టాడు. సదాశివపేట్‌లో వెంచర్లంటూ జనాల వద్ద సొమ్ము లాగేస్తున్నాడు. యోషితా ఇన్‌ఫ్రా ప్రీలాంచ్ వ్యవహారంపై రెరా నోటీసులిచ్చినా లెక్క చేయలేదు. ఈ సంస్థ సదాశివపేట్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లను విక్రయిస్తోంది.
ఆర్‌జే గ్రూప్ సంస్థ యజమాని భాస్కర్ గుప్తా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. ఇతను ప్రీలాంచ్ దందా జోరుగా జరుగుతుందని గుర్తించి.. హైదరాబాద్‌లో వాలిపోయి.. పలు వెంచర్లను, అపార్టుమెంట్లను ప్రీలాంచ్లో
మొత్తానికి, ఇలా హైదరాబాద్ చుట్టూ ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తూ.. ప్రజల నెత్తి మీద శఠగోపం పెడుతున్న రియల్టర్లలో అధిక శాతం మంది పొరుగు రాష్ట్రాలకు చెందినవారు కావడం గమనార్హం. మరి, ఇలాంటి మోసపూరిత రియల్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల్ని తీసుకోవాలి. లేకపోతే, వీరి బారిన పడి అనేకమంది ప్రజలు మోసపోతూనే ఉంటారు. కాబట్టి, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రీలాంచ్ అక్రమార్కులపై ఉక్కుపాదాన్ని మోపాలి.
This website uses cookies.