Categories: TOP STORIES

తెల్లాపూర్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ ప్రాజెక్టు

అత్యంత విలాసవంతమైన ప్రాజెక్టుల్లో ఓ చక్కని ఫ్లాట్ సొంతం చేసుకోవడం చాలా కష్టమని చాలామంది అంటుంటారు. కానీ అదేమీ అసాధ్యం కాదని రాజపుష్ప ఇంపీరియా చూస్తే మీకే అర్థమవుతుంది. రాజపుష్ప ప్రాపర్టీస్ నుంచి తెల్లాపూర్ లో సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ అద్భుతంగా ఆవిష్కృతమవుతోంది. ఇందులో ఫ్లాట్ సొంతం చేసుకుంటే హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో మీకు శాశ్వత చిరునామా ఉండటం ఒక్కటే కాదు.. అత్యంత సుందరమైన గేటెడ్ కమ్యూనిటీలో మహోన్నత జీవితం గడపడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. మీ ఇంటిని చూసి మీ స్నేహితులు, బంధుగణం అసూయపడే స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇంట్లోని ప్రతి చదరపు అడుగునూ ఆస్వాదించేలా, హాయిగొలిపే జీవనం మీ సొంతమవుతుంది.

మొత్తం 24 ఎకరాల స్థలంలో 8 టవర్లు 40 అంతస్తులతో నిర్మాణమవుతున్నాయి. ప్రాజెక్టు విస్తీర్ణంలో 82 శాతాని కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం విశేషం. వర్క్ ఫ్రం హోం స్పేస్ ఉండేలా అపార్ట్ మెంట్లు తీర్చిదిద్దుతున్నారు. డెక్ తో కూడిన రెండు స్విమ్మింగ్ పూల్స్ తోపాటు సన్ డెక్ అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. 2, 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది. 24 గంటల హై లెవల్ సీసీ టీవీ నిఘాతోపాటు ట్రాఫిక్ రహిత పొడియం, ఔట్ డోర్ జిమ్, ఏడున్నర ఎకరాల్లో సెంట్రల్ లాన్, సెంట్రల్ ప్లాజా, యాంఫిథియేటర్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, పార్టిసిపేటరీ గార్డెన్, ట్రీ కోర్టుతో కూడిన పెవిలియన్, పార్టీ లాన్, యోగా డెక్, స్కేటింగ్ రింక్, పెట్ పార్కు, సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం, స్పోర్ట్స్ కోర్టులు, అందమైన ల్యాండ్ స్కేప్ డిజైన్లు, ఎలివేటెడ్ ర్యాంప్, ప్రతి టవరుకూ ఓ ఎంట్రన్స్ లాంజ్, సోలార్ ఫెన్సింగ్ , సెంట్రలైజ్డ్ పైప్ డ్ గ్యాస్, గోల్ఫ్ పుటింగ్, వంద శాతం పవర్ బ్యాకప్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 1350 చదరపు అడుగులు, 1375 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే ఫ్లాట్లు ఉండగా.. 1550 చరదపు అడుగుల నుంచి 2880 చదరపు అడుగుల వరకు వివిధ పరిమాణాల్లో 3 బీహెచ్ కే ఫ్లాట్లు లభ్యం కానున్నాయి. సెంట్రల్ బాల్కనీ, సన్ డెక్ లతో రూపొందుతున్న ఈ అపార్ట్ మెంట్ లో 29 విభిన్నమైన ఫ్లోర్ ప్లాన్లు చూశాక ఏది ఎంపిక చేసుకోవాలో తేల్చుకోవడం కాస్త కష్టమే.

ఇక రాజపుష్ప ఇంపీరియాకు మరో అదనపు ఆకర్షణ.. గ్రాండ్ క్లబ్ హౌస్. 1.2 లక్షల చదరపు అడుగుల్లో జీ ప్లస్ నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ క్లబ్ హౌస్ లో అదిరిపోయే స్విమ్మింగ్ పూల్స్, మల్లీ ఫ్లోర్ జిమ్నాజియం, బాంకెట్ హాల్స్, స్పా, మెడిటేషన్ లాంజ్, లైబ్రరీ, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, ఇండోర్ గేమ్స్, రెస్టారెంట్లు, కేఫ్ ల వంటి పలు సౌకర్యాలు మీ ప్రీమియం జీవన అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళతాయి. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ ధర ఎంతో తెలుసా? 2 బీహెచ్ కే ధర రూ.95.83 లక్షల నుంచి, 3 బీహెచ్ కే ధర రూ.1.1 కోట్ల నుంచి మొదలవుతున్నాయి. 2026 మార్చినాటికి ఈ ప్రాజెక్టు పూర్తికానుంది

This website uses cookies.