భారతదేశంలోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థ ‘ప్రెస్టీజ్ గ్రూప్’ దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులకు కొవిడ్ టీకా వేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం విక్రమ్ హాస్పిటల్, మణిపాల్ మరియు అపోలో ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎఫ్ఎస్ అనే చెన్నై సంస్థతో అంగీకారానికి వచ్చింది. ఇందుకోసం సంస్థ దాదాపు కోటి రూపాయలు దాకా ఖర్చుపెడుతోంది. ఈ సంస్థ వద్ద పని చేసే ఇరవై వేల మందిలో ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబాలున్నాయి. ఈ వ్యాక్సీనేషన్ ప్రక్రియను జూన్ లో పూర్తి చేస్తామని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది. ‘ఇప్పటికే పద్దెనిమిదేళ్ల కంటే అధిక వయసు గల ఉద్యోగులందరికీ కొవిడ్ టీకాలను వేయిస్తున్నాం. ప్రతిరోజు దాదాపు 800 నుంచి వెయ్యి మందికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జూన్ లోపే దాదాపు అందరికీ వ్యాక్సీన్ వేస్తామ’ని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలన్ ఖురానా తెలిపారు