Categories: Celebrity Homes

ప‌ర్వ‌త ప్రాంతంలో.. ప్ర‌శాంతంగా ఉంటా!

  • ముఖచిత్రం ఫేమ్ ప్రియా వ‌డ్ల‌మాని

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రాంతంలో పెరిగిన ప్రియా వడ్లమణి.. ముఖచిత్రంలో విశ్వక్ సేన్‌తో కలిసి న‌టిస్తోంది. త‌ను ఇంతకుముందు అద్దె అపార్ట్మెంట్లో నివసించేవారు. చిన్ననాటి ఇల్లంటే చాలు.. ఆమెకు చ‌క్క‌టి జ్ఞాప‌కాలు గుర్తుకొస్తాయి. వాటి గురించి త‌ను ఇలా చెబుతోంది.. “ఎప్పుడైతే భారీ వర్షం కురిసేదో.. అప్పుడు నా స్నేహితుల‌తో క‌లిసి మంచు స్ప్రేల‌తో ఆడుకునేవాళ్లం. నాకు ఇష్టమైన డ్రాయింగ్ రూమ్‌లో రంగులు నింపడం, నేలపై కూర్చోవడం. . నేను చేయాల్సిన‌ పనుల జాబితాను కూడా రాయ‌డం అల‌వాటుగా ఉండేద’ని గుర్తు చేసుకున్నారు.

ఆమె స్వేచ్ఛ‌గా జీవించాల‌ని కోరుకుంటుంది. స‌హ‌జ‌మైన రంగులు, బ‌ట్ట‌ల‌ను ఇష్ట‌ప‌డుతుంది. కాక‌పోతే, బోహేమియన్ డెకర్ తన కలల ఇంటికి సరైన శైలి అని చెబుతోంది. ‘‘మ‌న ఇంట్లో బోహేమియన్ స్టైల్ డెకర్‌ని తీసుకు రావడానికి అనేక మార్గాలున్నాయి. నేను కళల విభాగంలో ఉన్నాను కాబట్టి.. నా వ్యక్తిగత ఇష్టమైన విషయానికి వస్తే.. అన్ని నియమాల్ని మరచిపోతాను. పాతకాలపు ఫర్నిచర్ సరైన ఎంపికగా భావిస్తా’’ అని వివరించారు.
ప్ర‌కృతిలో నివ‌సించాల‌న్న‌ది ప్రియా అభిమ‌తం. అందుకే, త‌ను అలాంటి వాతావ‌ర‌ణంలో ఉన్న ఇల్లు కొనాల‌ని కోరుకుంటోంది. సొంతిల్లు అనేది షాపింగ్ మాల్, సబ్‌వే లేదా హైవేకి ఎంత దగ్గరగా ఉంటుంద‌నేది ముఖ్యం కాదు.. ప్ర‌కృతికి ఎంత చేరువ‌గా ఉన్నామ‌న్న‌దే కీల‌క‌మ‌ని ప్రియా చెబుతోంది. నాకు కావాల్సిన కూర‌గాయ‌ల్ని త‌నే పండించుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంది. పర్యావరణ అనుకూలమైన ఆర్కిటెక్చ‌ర్ అంటే ఆమెకు మ‌క్కువ‌. నా ఇల్లు అడ‌విలో ఉండాల‌ని అనుకుంటున్నాను. పెంపుడు కుక్క‌లే కాదు పెద్ద బంగళా ఉంటే.. అందులో ఆవులు, పందులు వంటి జంతువుల‌ను ఉంచ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను.

 

నాకు అప్పుడే శ‌క్తి!

ప్రియా గదిలో ఒంటరిగా కూర్చోవడం చూసి అమ్మ‌ విపరీతంగా చిరాకుపడుతుంది. దీనికి సంబంధించి ఆమె ఇలా చెప్పుకొచ్చింది. “నేను అంతర్ముఖురాలిని. కొన్ని సంద‌ర్భాల్లో త‌ల్లిదండ్రుల‌తో కూడా మాట్లాడను. కానీ, అలా ఒంట‌రిగా గ‌దిలో కూర్చుంటే.. బ‌య‌టివాళ్లు అపోహ ప‌డ‌టం స‌హ‌జ‌మే క‌దా.. అయినా నేను ప‌డ‌క‌గదిలో ఒంట‌రిగా స‌మ‌యం గ‌డిపితే నాకు శ‌క్తి ల‌భిస్తుంది. అలా ఉండ‌టం మా అమ్మ‌కు న‌చ్చ‌దు. నిజానికి, నేను నా గ‌దిలో ఒంట‌రిగా ఉండ‌ను. నాకు ఇష్ట‌మైన పెంపుడు కుక్క ఎప్పుడు నాతోనే ఉంటుంది.

ధ‌ర‌మ్ కోట్‌లో ద‌ర్జాగా..

తన కలల ఇంటిని ధరమ్‌కోట్‌గా నిర్మించాలని ఎంచుకుని ఆశ్చర్యకరమైన నిర్ణ‌యం తీసుకుంది. “ఇది అన్యదేశ సౌందర్యాన్ని అందిస్తుంది, ఇటీవల కుండల వర్క్‌షాప్ కోసం అక్కడకు వచ్చాను. ఒక్క‌సారి ఇక్క‌డికొస్తే మ‌ళ్లీ బ‌య‌టికి రావాల‌ని కోరుకోరు. పైగా, నేను ప‌ర్వత ప్రేమికురాలిని. స‌హ‌జంగానే భావోద్వేగాలు ఎక్కువే ఉంటాయి. ఒక‌వేళ నేను న‌టిని కాన‌ట్ల‌యితే.. ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉండను. ఉత్తరం వైపు పర్వతాలకు మారాలని ప్లాన్ చేస్తున్నాను! షూటింగ్ అవసరాల కోసం మాత్రమే హైదరాబాద్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ చిన్న గ్రామం అంటే నాకు ఎంతో ఇష్టం. నిత్యం బిజీగా ఉండే నాకు స‌రైన విరామం అని చెప్పొచ్చు.

This website uses cookies.