అక్రమంగా సొమ్ము సంపాదించిన వారి వివరాల్ని అందజేసే వారికి అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక బహుమతిని అందజేస్తుంది. వారి వివరాలూ గోప్యంగా ఉంచుతారు. రెరా నిబంధనల్ని పాటించకుండా.. స్థానిక సంస్థల అనుమతి లేకుండా.. ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించే రియల్టర్ల సమాచారం అందజేసే వారికీ.. ప్రభుత్వం నజరానా ప్రకటిస్తే ఉత్తమం. అప్పుడే, రెరా నిబంధనల్ని రాష్ట్రంలో ప్రతిఒక్కరూ తప్పకుండా పాటిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధిక శాతం మంది బిల్డర్లు, రియల్టర్లు.. రెరా అనుమతి లేకుండా వెంచర్లు, అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఇలాంటి వారి నుంచి రెరా అథారిటీ ఎలాగూ పది శాతం జరిమానా విధిస్తుంది. కాబట్టి, ఆ మొత్తంలో నుంచి కానీ లేదా మరే ఇతర రకంగా అయినా కానీ.. సమాచారం ఇచ్చేవారికి రెరా బహుమతిని అందజేయాలి. అప్పుడే, అక్రమార్కుల ఆట కట్టడానికి వీలవుతుంది. ఇందుకు సంబంధించిన విధానాన్ని నిర్మాణ సంఘాల పెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.
This website uses cookies.