రాజపుష్ప ప్రాపర్టీస్..
రాజపుష్ప సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2006లో మొదలైన ఈ సంస్థ ఇప్పటివరకు అనేక అపార్ట్ మెంట్లు, విల్లాలు, వాణిజ్య భవనాలను నిర్మించింది. తాజాగా ఈ సంస్థ నుంచి హైదరాబాద్ లో కళ్లు చెదిరే రీతిలో మూడు అద్భతమైన ప్రాజెక్టులు వస్తున్నాయి. ప్రిస్టీనియా, ఇంపీరియా, ప్రావిన్సియా పేర్లతో వావ్ అనిపించేలా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉన్నాయి. మరి ఒక్కో ప్రాజెక్టు ఎక్కడ, ఏంటి అనే వివరాలు చూద్దామా?
కోకాపేట-నియోపొలిస్ రోడ్డులో 12.1 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టే ప్రిస్టీనియా. 2,3,4 బీహెచ్ కే వేరియంట్లతో 6 టవర్లుగా నిర్మితమవుతున్న ఈ ఆకాశహర్మంలో మొత్తం 1782 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. బి, సి, డి, ఇ టవర్లు 42 అంతస్తులతో.. ఎ, ఎఫ్ టవర్లు 38 అంతస్తులతోనూ ఉంటాయి. 1380 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే, 1730, 2040, 2355 చదరపు అడుగుల్లో ప్రీమియం 3 బీహెచ్ కే, 4450, 4575, 4595+మెయిడ్ రూమ్ తో 4 బీహెచ్ కే వేరియంట్లు ఉన్నాయి. 80 శాతం ఓపెన్ ఏరియా ఉండటం వల్ల అపార్ట్ మెంట్లలోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. ఇక 60 వేల చదరపు అడుగుల్లో ఉండే క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకు మరో అదనపు ఆకర్షణ.
రాజపుష్ప ప్రాపర్టీస్ నుంచి తెల్లాపూర్ లో సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ అద్భుతంగా ఆవిష్కృతమవుతోంది. మీ ఇంటిని చూసి మీ స్నేహితులు, బంధుగణం అసూయపడే స్థాయిలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇంట్లోని ప్రతి చదరపు అడుగునూ ఆస్వాదించేలా, హాయిగొలిపే జీవనం మీ సొంతమవుతుంది. మొత్తం 24 ఎకరాల స్థలంలో 8 టవర్లు 40 అంతస్తులతో నిర్మాణమవుతున్నాయి. ప్రాజెక్టు విస్తీర్ణంలో 82 శాతాని కంటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం విశేషం. వర్క్ ఫ్రం హోం స్పేస్ ఉండేలా అపార్ట్ మెంట్లను తీర్చిదిద్దుతున్నారు. డెక్ తో కూడిన రెండు స్విమ్మింగ్ పూల్స్ తోపాటు సన్ డెక్ అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. 2, 3 బీహెచ్ కే అపార్ట్ మెంట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి అందుబాటులోకి వస్తుంది.
24 గంటల హై లెవల్ సీసీ టీవీ నిఘాతోపాటు ట్రాఫిక్ రహిత పొడియం, ఔట్ డోర్ జిమ్, ఏడున్నర ఎకరాల్లో సెంట్రల్ లాన్, సెంట్రల్ ప్లాజాతో ఏంఫిథియేటర్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, పార్టిసిపేటరీ గార్డెన్, ట్రీ కోర్టుతో కూడిన పెవిలియన్, పార్టీ లాన్, యోగా డెక్, స్కేటింగ్ రింక్, పెట్ పార్కు, సైక్లింగ్ అండ్ జాగింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం, స్పోర్ట్స్ కోర్టులు, అందమైన ల్యాండ్ స్కేప్ డిజైన్లు, ఎలివేటెడ్ ర్యాంప్, ప్రతి టవరుకూ ఓ ఎంట్రన్స్ లాంజ్, సోలార్ ఫెన్సింగ్ , సెంట్రలైజ్డ్ పైప్ డ్ గ్యాస్, గోల్ఫ్ పుటింగ్, వంద శాతం పవర్ బ్యాకప్ వంటి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 1350 చదరపు అడుగులు, 1375 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే ఫ్లాట్లు ఉండగా.. 1550, 1720, 2045, 2210, 2215, 2255, 2345, 2520, 2550, 2650, 2655, 2840, 2880 చదరపు అడుగుల వరకు 3 బీహెచ్ కే ఫ్లాట్లు లభ్యం కానున్నాయి. సెంట్రల్ బాల్కనీ, సన్ డెక్ లతో రూపొందుతున్న ఈ అపార్ట్ మెంట్ లో 29 విభిన్నమైన ఫ్లోర్ ప్లాన్లు చూశాక ఏది ఎంపిక చేసుకోవాలో తేల్చుకోవడం కాస్త కష్టమే.
రాజపుష్ప ఇంపీరియా నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే పలు అంతర్జాతీయ స్కూళ్లు, ప్రముఖ విద్యా సంస్థలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఎంఎన్ సీలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వంటివి సమీపంలోనే ఉన్నాయి. ఇంపీరియా ఫ్లాట్ ధర రూ.కోటి నుంచి మొదలవుతుంది. ప్రస్తుతం బుక్ చేసుకుంటే చదరపు అడుగు రూ.7449కే వస్తుంది. అక్టోబర్ 2 నుంచి ఇది 7,499గా మారుతుంది.
అటు ఆహ్లాదం.. ఇటు అద్భుత నిర్మాణం.. రెండూ కలగలిసిన ప్రీమియం లైఫ్ స్టైల్ హైరైజ్ అపార్ట్ మెంట్ కోసం చూస్తున్నవారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని నార్సింగిలో రాజపుష్ప ప్రొవిన్షియాను సందర్శించాల్సిందే. 23.75 ఎకరాల సువిశాల స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీ+39 అంతస్తులతో 11 హైరైజ్ టవర్లు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. 1370 చదరపు అడుగుల్లో 2 బీహెచ్ కే, 1715, 2020,2335, 2660 చదరపు అడుగుల్లో 3 బీహెచ్ కే ప్రీమియం లైఫ్ స్టైట్ అపార్ట్ మెంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ కార్ చార్జింగ్ తోపాటు లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు క్లబ్ హౌస్ లు (క్లబ్ ఒడిస్సీ, క్లబ్ ఒయాసిస్) ఈ ప్రాజెక్టుకి మరింత ఆకర్షణీయం కానున్నాయి. అన్ని వయసుల వారికీ అవసరమైన సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తున్నారు.
This website uses cookies.