ఈ ప్రపంచంలో ఏ ఉత్పత్తికైనా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. అత్యధిక నాణ్యతా ప్రమాణాలు పాటించే కంపెనీ.. వినియోగదారుల విశ్వాసం చూరగొంటుంది. తద్వారా ఆ కంపెనీ బ్రాండ్ విలువ ఎల్లప్పుడూ అందనంత ఎత్తులో ఉంటుంది. మరి రియల్ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్.. ప్రాజెక్టును నిర్దేశిత సమయానికి డెలివరీ చేయాలి.. నిర్మాణంలో అత్యధిక నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. అంతే.. మీ బ్రాండ్ వాల్యూ ఎంతగా పెరుగుతుందంటే మీరే నమ్మలేరు. ఫలానా కంపెనీ ప్రాజెక్టా? కళ్లు మూసుకుని పెట్టుబడి పెట్టొచ్చు. సకాలంలో డెలివరీ చేయడంలో వారి ట్రాక్ రికార్డుకు తిరుగు లేదు అనేలా బ్రాండ్ విలువ పెంచుకోవాలి.
రియల్ రంగంలో పోటీ ఎక్కువే. పైగా ఇక్కడి కొనుగోలుదారుల అంచనాలు కూడా నిరంతరం పెరుగుతూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకునేలా రియల్టర్లు కూడా మారుతుండాలి. నిజానికి రియల్ రంగంలో అపరిమితమైన విలువ కలిగి ఉండే ముఖ్యమైన అంశం.. విశ్వాసం. కొనుగోలుదారుల విశ్వాసమే ఏ కంపెనీకైనా తిరుగులేని ఆస్తి. సకాలంలో డెలివరీ ఇవ్వడం విశ్వసనీయతను పెంపొందిస్తుంది. ఇక్కడ బ్రాండ్ అంటే కేవలం భవనాలను నిర్మించడమే కాదు.. వాగ్దానాలను కూడా నిలబెట్టుకోవడం. ఓ కంపెనీ ప్రాజెక్టు సకాలంలో డెలివరీ చేయగలుగుతుంది అనే నమ్మకం ఉంటే.. కొనుగోలుదారులు ఇతర ఆప్షన్లు వెతుక్కోకుండా ఆ ప్రాజెక్టునే ఎంచుకుంటారు.
అలాగే ప్రాజెక్టు అప్పగింత తర్వాత నిర్దేశిత కాలంపాటు ఎలాంటి ఇబ్బందులు లేని సర్వీస్ అందించగలగాలి. ఇలాంటి డెవలపర్లను ఎవరూ వదులుకోరు. అందువల్ల డెవలపర్ల ప్రధాన లక్ష్యం.. పరిశ్రమ ప్రమాణాలను పునర్నిర్వచించే బెంచ్ మార్కులు సెట్ చేసేలా ఉండాలి. ఇలాంటి బిల్డర్లకు ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదు. ఆ కంపెనీ కొనుగోలుదారులే ప్రచారకర్తలుగా మారిపోతారు. ఫలానా కంపెనీలో ప్లాట్ కొంటే ఎలాంటి సమస్యలూ ఉండవని వాస్తవం చెప్పడం ద్వారా నలుగురిని ప్రభావితం చేయగలుగుతారు. ఈ నేపథ్యంలో రియల్టర్లు తమ పట్ల కొనుగోలుదారులు విశ్వాసం పొందేలా నిబద్ధతతో వ్యవహరించాలి. అలా చేసినన్నాళ్లూ.. వారి బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది.
This website uses cookies.