Categories: Celebrity Homes

నా ఇంట్లో ఏడాది పొడవునా పూలు పూయాలి

  • రియల్ ఎస్టేట్ గురుతో కాంచన-3 ఫేమ్ వేదిక

ప్రముఖ మలయాళ నటి, కాంచన-3 ఫేమ్ వేదిక కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేసిన ప్రముఖుల్లో ఒకరు. ఆమె తన పేరుతో ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి రూ.కోటికి పైగా వెచ్చించారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది కదా? వేదిక కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సొంతింటికి సంబంధించి ఆమె తన అభిప్రాయాలను రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు. ‘అది 2015. నా కోసం ఓ అపార్ట్ మెంట్ కొనుక్కున్న సంవత్సరం. అయితే, నా చిన్ననాటి ఇల్లు కూడా నాకు ప్రత్యేకంగానే ఉంటుంది. ఎందుకంటే నాకు అక్కడ ఎన్నో మధురమైన అనుభూతులు ఉన్నాయి. నా బెడ్ రూమ్ లోని అద్దం ముందు డ్యాన్స్ చేయడం నాకు ఎంతో ఇష్టం. ఏదో ఒకరోజు నటి కావాలనే తలపు మొదలైంది అక్కడే. ఇదంతా ఆ ఇంటి నుంచే మొదలైంది’ అని వివరించారు.

‘నాకు చాలా ఇష్టమైన రంగు తెలుపు. అందువల్ల అన్నీ లేత రంగుల్లోనే ఉండాలని కోరుకుంటాను. ఇక విలాసవంతమైన డెకర్ కు ఓకే చెప్పొచ్చు. అయితే, అవి అందంగా ఉండాలి. కానీ నాకు మాత్రం అది అవసరం లేదు. సానుకూల వాతావరణం కోసం నేను చాలా లైట్లు జోడించాను’ అని వేదిక పేర్కొన్నారు. తెలుపు అనేది ఆమెకు చాలా తటస్థమైన అంశం. ఆమె తన ఫ్యాంటసీ ల్యాండ్ లో నిద్రపోతున్న అనుభూతి సృష్టించుకోవడం కోసం తెలుపునే వినియోగించారు. దీంతో అది ఆహ్లాదకర, పూర్తి నివాసయోగ్యంగా కనిపిస్తోంది. అది ఆమె శాశ్వతమైన స్థలం కాబట్టి అక్కడ ఎలాంటి అతీ ఉండకూడదని కోరుకుంటున్నారు.

త‌న ఇష్టాయిష్టాల గురించి ఆమె ఇలా వివ‌రించారు. ‘వేసవి కాలం అంతా నేను పూలను ఆస్వాదిస్తాను. నాకు రంగులంటే ఇష్టం కాబట్టి నా ఇంట్లో పువ్వులు ఉండాలి. ఏడాది పొడవునా పూలు పూయడం మంచిది. అప్పుడు నాకు ఫ్రెంచ్ కిటికీలను ఇష్టపడతాను. అవి గాలిలోకి కాలాతీత గాంభీర్యాన్ని జోడిస్తాయి. నేను ఎప్పుడూ ఈ దేశంలోనే జీవిస్తాను’ అని వేదిక స్పష్టం చేశారు. జార్జ్ క్లూనీకి అత్యంత స్టైలిష్ హోమ్ ఉందని ఆమె పేర్కొన్నారు. ‘లేక్ కోమోలోని ఆ విలాసవంతమైన విల్లా చూపులను కట్టిపడేస్తుంది. ఆ హాలీవుడ్ రాయల్టీ మ్యాన్ తన ఇంటితో హృదయాలకు రాజుగా మారాడు. నేను ఆ ఇంటిని చూసి మైమరచిపోయాను. ఇటాలియన్ టచ్ చూసి తన్మయత్వం చెందాను’ అని వేదిక వివరించారు.

This website uses cookies.