మాల్స్, వాణిజ్య భవనాల్లో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజుపై ప్రాపర్టీ ట్యాక్స్ విధించాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త విధానం తీసుకొచ్చింది. అయితే, పార్కింగ్ ఉచితంగా ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీలు, వాణిజ్య భవనాలకు ఇది వర్తించదని పేర్కొంది.
బంగ్లాలు, నివాసాల్లో పార్కింగ్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు, సన్ షేడ్ల కు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ కమిటీ చైర్మన్ జైనిక్ వకీల్ తెలిపారు. పార్కింగ్ స్పేస్ లో వాహనాల రాకపోకల కోసం ఉండే రన్ వే స్పేస్ ను ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మినహాయిస్తారని పేర్కొన్నారు. మొత్తం పార్కింగ్ స్పేస్ లో 35 శాతం రన్ వే స్పేస్ కిందకు వస్తుందన్నారు.
This website uses cookies.