- మంగుళూరు సిటీ కార్పొరేషన్ నిర్ణయం
స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (ఎస్ఏఎస్) ద్వారా నిర్ధారించిన ఆస్తి పన్నును పోస్టాఫీసులు, మంగుళూరు వన్ సెంటర్ల ద్వారా స్వీకరించాలని మంగుళూరు సిటీ కార్పొరేషన్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరవాసులు తమ ఆస్తి పన్నును పోస్టాఫీసులు, మంగళూరు వన్ సెంటర్ల ద్వారా చెల్లించొచ్చని ఎంసీసీ కమిషనర్ అక్షయ్ శ్రీధర్ వెల్లడించారు. ‘గతేడాది నవంబర్ నుంచి ఆస్తి పన్నును ఆన్ లైన్ లో చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాం. నగరవాసులు నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ఆన్ లైన్ లో చెల్లించే అవకాశం తీసుకొచ్చాం. ఇప్పుడు ప్రజలు తమ ఆస్తి పన్నును పోస్టాఫీసులు, మంగుళూరు వన్ సెంటర్ల ద్వారా కూడా చెల్లించే వెసులుబాటు కల్పించాం’ అని వివరించారు.