హైదరాబాద్ లోని రియల్టీ డెవలపర్ కె రహేజా కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్కులో.. అమెరికా బహుళజాతి సంస్థ క్వాల్ కామ్ 1.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకుంది. అతిపెద్ద ఆఫీసు లీజు లావాదేవీల్లో ఇది ఒకటని చెబుతున్నారు. అంతేకాకుండా అమెరికా వెలుపల ఎక్కడైనా సరే క్వాల్ కామ్ అతిపెద్ద కార్యాలయం ఇదే అవుతుంది.
ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకు 15 శాతం పెంపుతో 15 ఏళ్ల కాలానికి క్వాల్ కామ్ మొత్తం రూ. 3,054 కోట్లకు పైగా అద్దె రూపంలో చెల్లించనుంది. క్వాల్ కామ్ కు ప్రస్తుతం హైదరాబాద్ లో పలు కార్యాలయాలతోపాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కార్యాలయాలను కలిగి ఉంది. ఒక్క హైదరాబాద్ లోనే రహేజా కార్ప్ మైండ్ స్పేస్ ఐటీ పార్కులోని బహుళ వాణిజ్య భవనాల్లో ఒక మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కలిగి ఉంది. ఇక కొత్త కార్యాలయంలో హైదరాబాద్ లో ఉన్న ప్రస్తుత సిబ్బంది సహా 17వేల మంది ఉద్యోగులకు సరిపోతుందని తెలుస్తోంది.
This website uses cookies.