టీమ్ 4 లైఫ్ స్పేసెస్ మేనేజింగ్
పార్ట్‌నర్ రాజేష్ ప్రసాద్
నలుగురు స్నేహితులం కలిసి టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్‌ను ఆరంభించాం. ఆరంభ సమయంలో మేం ఒకటే అనుకున్నాం. ఈ ప్రాజెక్టుల్లో ఎంత సంపాదిస్తామో ముఖ్యం కాదు.. కొనుగోలుదారులకు నాణ్యతతో కూడిన ఇళ్లను సమయానికి డెలివరీ అందించాలన్నదే కీలకమని అనుకున్నాం. దానికి అనుగుణంగా నలుగురం కష్టపడి పని చేసుకుంటూ ముందుకెళుతున్నామని టీమ్ ఫోర్ లైఫ్ స్పెసెస్ మేనేజింగ్ పార్ట్‌నర్ రాజేష్ ప్రసాద్ తెలిపారు. రియల్ ఎస్టేట్ గురుతో ఆయన మాట్లాడుతూ.. నగర రియల్ మార్కెట్‌కు సంబంధించిన తాజా పరిస్థితుల గురించి ప్రత్యేకంగా వివరించారు. హైదరాబాద్ రియల్ రంగాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తూ.. ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తామని తెలిపారు. మరి, ఇంటర్వ్యూ సారాంశం రాజేష్ ప్రసాద్ మాటల్లోనే..
హైదరాబాద్‌లో ప్రస్తుతం రెండు బడా ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాం. మియాపూర్‌లో మధ్యతరగతి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకుని.. అఫర్డబుల్ లగ్జరీ ఫ్లాట్లకు శ్రీకారం చుట్టాం. రెరా అనుమతి గల ఈ ప్రాజెక్టుకు టీమ్ ఫోర్ నైలా అని పేరు పెట్టాం. పశ్చిమ హైదరాబాద్‌లో ఐటీ, ఎన్ఆర్ఐలను దృష్టిలో పెట్టుకుని ఊబర్ లగ్జరీ ప్రాజెక్టును డిజైన్ చేశాం. రెండూ ప్రైమ్ లొకేషన్‌లో ఉండటంతో.. మేం అనుకున్నట్లే కొనుగోలుదారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊహించిన దానికంటే ఎక్కువ ఫ్లాట్లను మేం విక్రయించగలిగాం. కొనుగోళ్లతో సంబంధం లేకుండా నిర్మాణ పనుల్ని కూడా జోరుగా జరిపిస్తున్నాం. బయ్యర్లకు బెస్ట్ ఇవ్వాలన్న తాపత్రయంతో మేం నలుగురం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం.
మోడల్ ఫ్లోర్ ఐడియా..
మియాపూర్‌లోని నైలా ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు చకాచకా జరుగుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకెళుతున్నాం. అయితే, నైలా ప్రాజెక్టును 25 అంతస్తులను కట్టేసిన తర్వాత.. ఫ్లోరంతా ఎలా కనిపిస్తుందనే విషయాన్ని బయ్యర్లకు అర్థమయ్యేలా చూపించాలని అనుకున్నాం. సాధారణంగా మనం అనేక ప్రాజెక్టుల్లో మోడల్ ఫ్లాట్లను ఇదివరకే చూశాం. కానీ, అందుకు భిన్నంగా మోడల్ ఫ్లోర్ కాన్సెప్టుకు శ్రీకారం చుట్టాం. ఇప్పటివరకూ నగరంలో ఏ బిల్డరూ ఇలా చేసింది లేదని అనుకుంటున్నాను. ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లను ఎలా డెలివరీ చేయనున్నామనే విషయాన్ని బయ్యర్లకు అర్థమయ్యేలా చెప్పాలని భావించాం. నిర్మాణంలో వాడుతున్న బిల్డింగ్ మెటీరియల్ గురించీ వారికి తెలియాలని అనుకున్నాం. మూడు బ్లాకుల్లో తొమ్మిది రకాల ఫ్లాట్లను ఎలా డెలివరీ చేస్తున్నామనే విషయాన్ని కొనుగోలుదారులు కళ్లారా చూసి తెలుసుకున్నారు. మా క్వాలిటీ గురించి అందరికీ అర్థమైంది. అందుకే, మియాపూర్‌లోనే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ఫ్లాట్లను అమ్మగల్గుతున్నాం.
ఆదరణ ఇందుకే..
నైలా ఆరంభించినప్పుడు మేం ముందే ఒక మాట అనుకున్నాం. ఈ ప్రాజెక్టులో ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు.. నాణ్యతతో కూడిన ఫ్లాట్లను అందించాలనే నిర్ణయం తీసుకున్నాం. కొనుగోలుదారుల సంతోషమే కీలకమని భావించాం. అప్పుడే, కస్టమర్ల ఆదరణ ఉంటుందని అనుకున్నాం. మొదట్లో వంద, నూట యాభై ఫ్లాట్లను విక్రయించేవాళ్లం. నాణ్యత, నిర్మాణ పనుల్లో పురోగతి గురించి బయ్యర్లకు తెలిసింది. అందుకే, ఎలాంటి ప్రకటనలు లేకుండానే.. వాళ్లంతట వారే కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు.
మీరు గమనిస్తే.. ప్రతి చోట నాలుగైదు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. కస్టమర్లు ఏం చేస్తారంటే, దాదాపు ఒకట్రెండు నెలల పాటు అన్ని ప్రాజెక్టుల్ని తిరిగి.. అన్నీ ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఏ డెవలపర్ ఎలా కడుతున్నారు? నాణ్యతను ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఇవన్నీ కళ్లతో చూశాకే.. నిర్మాణ పనుల్లో పురోగతి.. క్వాలిటీని గమనించాక.. మా వద్దకొచ్చి అంతిమంగా ఫ్లాటును కొంటున్నారు. ఇలా ప్రతినెలా మాకు కావాల్సిన సంఖ్యలో ఫ్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. మొత్తానికి, ఇప్పుడు మా దగ్గర మహా అయితే తొంభై దాకా ఫ్లాట్లు ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో పూర్తవుతాయనే నమ్మకంతో మేం ఉన్నాం. ఇనీషియల్‌గా కొన్నవారు ఇప్పటికే మంచి అప్రిసియేషన్‌ను అందుకున్నారు. ప్రస్తుతం మా రేటు అందరికీ అందుబాటులో ఉంది. అందుకే, మా నైలా 4 ప్రాజెక్టు వ్యాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు.
రెండు ప్రాజెక్టులు..
ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తున్నాం. మియాపూర్‌లో నైలా ప్రాజెక్టును 1.5 మిలియన్ చదరపు అడుగుల్లో కడుతున్నాం. మరో ప్రాజెక్టు మణికొండలో ఆర్కాను 3.5 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నాం. మరో ప్రాజెక్టును మియాపూర్‌లోనే నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. నగరంలో మంచి స్థలం లభిస్తే.. విల్లా ప్రాజెక్టుల్ని చేపట్టాలనే ఆలోచన కూడా ఉంది. చివరిగా, హైదరాబాద్‌లో సొంతిల్లు కొనుక్కోవాలని భావించేవారు.. రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో కొనుగోలు చేస్తేనే ఉత్తమం. అంతేకాదు, నాణ్యతతో సమయానికి డెలివరీ చేసే ప్రాజెక్టుల్ని మాత్రమే ఎంచుకోవాలి.