కొనుగోలుదారులకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ.. వారితో నిత్యం సత్సంబంధాలు కొనసాగించే సంస్థలే.. దీర్ఘకాలంలో మార్కెట్లో నిలదొక్కుకుంటాయి. మాంద్యం, కరోనా వంటి వైపరీత్యాలు ఎదురైనా సమర్థంగా నిలబడతాయి. ఈ క్రమంలో ఎప్పుడూ ముందంజలో ఉండే రాజపుష్ప ప్రాపర్టీస్.. ఇటీవల తమ ప్రత్యేకతను చాటి చెప్పే పనికి ఉపక్రమించిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే..
రాజపుష్ప ప్రాపర్టీస్ కోకాపేట్‌లో ప్రిస్టీనియా అనే ప్రాజెక్టుకు ఆరంభించింది. రెరా అనుమతి కూడా లభించింది. సుమారు 12.1 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కొన్ని ఫ్లాట్లను పాత కొనుగోలుదారులకు అందించాలని నిర్ణయించింది. ఒక ప్రత్యేక ధరను నిర్ణయించి.. బయ్యర్లకు సమాచారం అందించింది. మొదటి రోజే, దాదాపు 200 మంది విచ్చేసి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును రాజపుష్ప ప్రాపర్టీస్ అధికారికంగా ఆరంభించలేదు. కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. కోకాపేట్‌లో కొత్త ప్రాజెక్టును ఆరంభించామని చెప్పి.. ఒక రేటును నిర్ణయించి.. పాత కొనుగోలుదారులకు సమాచారం అందజేసింది. అంతే, సుమారు 200 మంది ముందుకొచ్చి ఫ్లాట్లను కొనుగోలు చేశారు. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. మంచి ప్రాజెక్టుకు కొనుగోలుదారుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తుందని చెప్పడానికి నిదర్శనమిదే!
This website uses cookies.