హైదరాబాద్ నిర్మాణ దిగ్గజం రాజపుష్ప ప్రాపర్టీస్ సరికొత్త లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. నానక్ రాం గూడ సర్వీస్ రోడ్డు నుంచి నార్సింగి వెళ్లే దారిలో.. మైహోమ్ అవతార్ దాటిన తర్వాత ఎడమ వైపు తిరగ్గానే రాజపుష్ప ప్రావిన్షియా ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 23.75 ఎకరాల్లో.. ఆకాశాన్నంటే రీతిలో నిర్మించే పదకొండు టవర్లలో 3,498 ఫ్లాట్లను నిర్మిస్తారు. జి ప్లస్ 39 అంతస్తుల ఎత్తులో 2, 3 పడక గదుల్ని డిజైన్ చేశారు.
ఫ్లాట్ల సైజు 1,370 నుంచి 2,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపడతారు. ప్రపంచ స్థాయి ఆధునిక సదుపాయాల్ని ఆస్వాదించాలని భావించేవారికి రాజపుష్ప ప్రావిన్షియా ప్రాజెక్టు చక్కగా నప్పుతుంది. బడా విస్తీర్ణం గల ప్రాజెక్టు కావడంతో రెండు క్లబ్ హౌసులు ఉండాలని సంస్థ భావించింది. సుమారు లక్షన్నర చదరపు అడుగుల్లో క్లబ్ హౌజును నిర్మిస్తోంది. రాజపుష్ప ప్రావిన్షియా ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే.. కార్ పార్కింగులో ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.
రాజపుష్ప ప్రావిన్షియా ప్రాజెక్టును సూపర్ లొకేషన్ లో చేపట్టారు. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లకు చేరువలో నివసించాలని కోరుకునేవారికి అమితంగా నప్పుతుందీ ప్రావిన్షియా. ఇక్కడ్నుంచి విప్రో ఫేజ్ 2 సుమారు రెండున్నర కిలోమీటర్ల చేరువలో ఉంటుంది. క్యూ సిటీ, విప్రో, మైక్రోసాఫ్ట్, వేవ్ రాక్, ఇన్ఫోసిస్ వంటివి దాదాపు రెండున్నర కిలోమీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల లోపే ఉంటాయి. కాబట్టి, ఒక చక్కటి ప్రాంతంలో నివసించాలని కోరుకునేవారికి ఇంతకు మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి.
This website uses cookies.