poulomi avante poulomi avante

కొత్త‌గా ఇల్లు కొనేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్‌

  • రెపో రేట్‌లో 25 పాయింట్ల కోత
  • 6.25 నుంచి 6%కి తగ్గిన వడ్డీరేట్లు
  • ఎస్‌డీఎఫ్‌ రేటు 5.7% కి తగ్గింపు
  • 6.5% కి తగ్గిన ఎంఎస్‌ఎఫ్‌ రేటు

కొత్త‌గా ఇల్లు కొనాల‌ని భావించే వారికి గుడ్ న్యూస్‌. ఆర్బీఐ మరోసారి ఇంట్రెస్ట్‌ రేట్స్‌లో కోత విధించింది. మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మరో 25 పాయింట్ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు . రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయంతో 6.25 శాతంగా ఉన్న రెపో రేటు 6 శాతానికి దిగి వచ్చింది. ఇలా వడ్డీ రేట్లు తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి రెపో రేట్స్‌ కట్‌ చేసింది ఆర్బీఐ. నిజానికి ఈ సారి 50 పాయింట్లు తగ్గింపు ఉండొచ్చని అందరూ అంచనా వేశారు. అయితే ఆర్బీఐ మాత్రం 25 పాయింట్లే కట్‌ చేసింది. ట్రంప్‌ టారిఫ్‌ల మోత.. స్టాక్‌మార్కెట్లు బేర్‌ చేతిలో చిక్కి విలవిల్లాడుతోన్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ నిర్ణయం కస్టమర్లకి ఊరటనిచ్చేదే.

ప్రపంచమంతా ఆర్థికంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయ్‌. Trump Tariff ట్రంఫ్‌ టారిఫ్‌ల పుణ్యమా అని కస్టమర్ల వినిమయం, కొనుగోలు శక్తిపై నీలి నీడలు కమ్ముకొంటాయోమేనన్న భయాలు వెంటాడుతున్నాయ్‌. పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చంటున్నారు. ఈ ఒత్తిడిలన్నింటికి మెడిసన్‌ వేసే బాధ్యత తీసుకొంది ఆర్బీఐ. ముందే అలర్ట్‌ అయి కస్టమర్లపై ఎలాంటి ప్రభావాలు పడకుండా వడ్డీరేట్లను మరోసారి తగ్గిస్తూ భారీ ఊరటనిచ్చే నిర్ణయాన్ని తీసుకొంది. భవిష్యత్‌లో మరిన్ని వడ్డీరేట్ల తగ్గింపులు ఉంటాయని గతంలోనే హింట్‌ ఇచ్చింది ఆర్బీఐ.

వినియోగదారులకి భారీ ఊరటనిచ్చేలా తమ నిర్ణయాలు ఉంటాయన్న Reserve Bank రిజర్వ్‌ బ్యాంక్‌ అందుకు తగ్గట్టే అడుగులు వేస్తోంది. ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి రెపో రేట్లను కట్‌ చేసిన ఆర్బీఐ- రెండు నెలలు తిరక్కముందే మరోసారి వినియోగదారులకి.. మరీ ముఖ్యంగా లోన్‌ పేయర్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నామని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్‌. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా నిర్ణయంతో ఇంట్రెస్ట్‌ రేట్స్‌ 6 శాతానికి దిగి వచ్చాయ్‌.

ALSO READ: 54 ల‌క్ష‌ల‌పై 54 వేలు అద్దె.. అంతా హంబ‌క్కేనా?

వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయానికి మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవ ఆమోదం వేసింది. ఇక బేసిస్‌ పాయింట్లలో కోత విధిస్తూ ఆర్బీఐ తీసుకొన్న నిర్ణయం వల్ల హోమ్‌, వెహికల్‌, ఇతర రుణాల వడ్డీరేట్లు మరింత తగ్గే ఛాన్స్‌ ఉంది. ఇక ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ప్రసంగంలోని కీ పాయింట్స్‌ చూస్తే-

* స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మారాలి
* ప్రస్తుతం నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల వల్ల కస్టమర్లపై ప్రతికూల ప్రభావం
* దీనివల్ల వృద్ధి రేటు స్లో అవ్వొచ్చు
* అధిక సుంకాల కారణంగా ఎక్స్‌పోర్ట్స్‌పై తీవ్ర ప్రభావం
* మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగం మళ్లీ ట్రాక్‌ ఎక్కుతున్న సంకేతాలు
* 2025-2026 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5%గా నమోదయ్యే ఛాన్స్‌
* జీడీపీ ఫస్ట్‌ క్వార్టర్‌లో 6.5%, రెండో త్రైమాసికంలో 6.7% ఉండొచ్చని అంచనా
* 3,4 త్రైమాసికాల్లో గ్రోత్‌ రేట్‌ 6.6%, 6.3% శాతంగా ఉండొచ్చు
* 2025-2026లో ఫుడ్‌ ఇన్‌ఫ్లేషన్‌ 4 శాతానికి దిగి రావొచ్చు
* ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి మన దగ్గరున్న విదేశీ నిల్వలు 676 బిలియన్‌ డాలర్లు
* వీటివల్ల వచ్చే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందుల్లేవు

ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వాణిజ్య బ్యాంక్‌లు వడ్డీ రేట్లు Commercial banks interest rates తగ్గించాయ్‌. దీంతో బ్యాంక్‌లు కూడా కస్టమర్లకిచ్చే రీటైల్‌ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను సవరించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల బ్యాంక్‌ల నుంచి లోన్లు తీసుకున్న వారికి ఊరట కలగనుంది. ముఖ్యంగా బ్యాంక్‌ల వద్దల రుణాలు తీసుకొని గృహాలు కొనుగోలు చేసిన వారిపై హోమ్‌లోన్ల ఈఎంఐ భారం తగ్గనుంది. ఇతర రుణాలపై కూడా ఈఎంఐల బర్డెన్‌ తగ్గడం ఖాయం.

ప్రస్తుతం బ్యాంక్‌లన్నీ కూడా లింక్డ్‌ రుణాల్ని అందిస్తున్నాయి కాబట్టి వడ్డీరేట్లు వెంటనే తగ్గే అవకాశముంటుంది. రీసెట్‌ డేట్‌ నుంచి ఈ తగ్గింపే అమల్లోకి వస్తుంది. దీనివల్ల లోన్ టెన్యూర్‌ లేదా లోన్‌ ఈఎంఐ దిగొచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు. హోమ్‌లోన్లపై ఇంట్రెస్ట్‌ రేట్స్‌ అండ్‌ ఈఎంఐల భారం తక్కువే ఉంటుంది కనుక రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊపు ఇవ్వడం ఖాయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయ్‌. అదే సమయంలో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఈ తగ్గింపు ఝలక్‌ అనే చెప్పాలి. ఎందుకంటే రెపోరేట్‌ తగ్గింపు వల్ల బ్యాంక్‌లు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే ఛాన్స్‌ ఉంది కాబట్టి ఎఫ్‌డీ రేట్లు ఇప్పుడున్న వాటి కంటే కిందికి దిగొచ్చు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles