రెపో రేట్ల కోత వల్ల హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గుతాయ్. ఫలితంగా ఈఎంఐలపై కట్టాల్సిన అమౌంట్ తగ్గి మీ డబ్బు ఆదా అయినట్టే. అలాగని ఈ తగ్గింపు అందరికీ వర్తించదు. కేవలం Repo-linked home loans రెపో-లింక్డ్ హోమ్స్ లోన్స్‌ను ఎంచుకున్న వారికి మాత్రమే ఆర్బీఐ ఇంట్రెస్ట్ కటింగ్స్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మరి రుణగ్రహీతలు ఇప్పుడేం చేయాలంటే..
* మీ రుణ బెంచ్‌మార్క్‌ను ఓ సారి తనిఖీ చేయండి
* మీ లోన్ రెపో రేట్లకు లింక్ చేసి ఉండకపోతే వెంటనే ఆప్షన్ మార్చుకోండి
* మీ క్రెడిట్ ప్రొఫైల్ credit profile పర్ఫెక్ట్‌గా ఉంటే మీ రుణ గ్రహీతను తక్కువ రేట్లు అడగండి
* మెరుగైన నిబంధనలు ఆఫర్ చేసే లెండర్స్‌కి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం మీ డబ్బును ఆదా చేస్తుంది
* అలాగే కట్టాల్సిన ఈఎంఐ మొత్తం తగ్గినప్పుడు మీ ఆదాల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి.
ALSO READ: జీహెచ్ఎంసీకి ఒక్కరోజే రూ.100 కోట్లు
సాధారణంగా లోన్ తీసుకున్న రుణ గ్రహీతలందరూ రెపో-లింక్డ్ రేట్లపై ఉండరు. కొత్త ఫ్లోటింగ్ రేట్ రుణాలకు రెపో-లింక్డ్ చేయడాన్ని ఆర్బీఐ ఆరేళ్ల క్రితమే తప్పనిసరి చేసినప్పటికీ చాలామంది రుణగ్రహీతలు ఇప్పటికీ ఎంసీఎల్‌ఆర్ లేదా బేస్ రేట్ వంటి పాత బెంచ్ మార్క్‌నే ఫాలో అవుతున్నారు. ఈ కారణంగా కొత్త వడ్డీరేట్లు అందరికీ వర్తించవంటున్నారు బ్యాంకర్లు. లోన్స్ తీసుకున్న వారు బ్యాంక్‌ల్ని సంప్రదించి లోన్ బెంచ్‌మార్క్‌ను ఛేంజ్ చేసుకుంటే రెపో రేట్ల కోత వల్ల కలిగే ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు.