హైదరాబాద్ లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో రెడీ టూ మూవ్ ఇన్ ప్రాపర్టీలకు 84 శాతం డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఇన్వెస్టర్లు అద్దె ఆదాయం కోసం వీటి వైపు చూస్తున్నారని సమాచారం. దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగం పురోగతిలో ఉండటం.. ఇతర రంగాల కంటే ఇందులోనే చక్కని రాబడులు ఉండటంతో అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ఎన్నారైల చూపు రియల్ రంగం వైపే ఉంది. దీంతో అధిక అద్దె ఆదాయాన్ని ఇచ్చే రెడీ టూ మూవ్ ఇన్ ఆస్తుల్ని కొంటున్నారు. పెరుగుతున్న అద్దెల రూపంలో ఆదాయం పొందడం కోసం తాము వీటిని ఎంచుకుంటున్నట్టు తెలిసింది. కొంతమంది అందుబాటు ధరలో ఉన్న ఇళ్లను ఎంచుకుంటున్నట్టు వివరించారు. నగరంలో ఆస్తి కలిగి ఉండటం ఆర్థిక భధ్రత ఇస్తుందనే ఉద్దేశంతో కొందరు కొంటున్నారు. శివార్లు వద్దు.. నగరమే ముద్దు అని కొనుగోలుదారులు అంటున్నారు.