Categories: LATEST UPDATES

హైద‌రాబాద్‌లో.. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్

ధ‌ర‌.. 5500 నుంచి 6000 మాత్ర‌మే

జీఎస్టీ క‌ట్ట‌క్క‌ర్లేదు..
ఇంటీరియ‌ర్స్ త‌ర్వాత గృహ‌ప్ర‌వేశ‌మే

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు మూడు ద‌శాబ్దాల అనుభ‌వం గ‌ల ఆర్‌వీ నిర్మాణ్ సంస్థ.. బండ్ల‌గూడ‌లో ఆర్‌వీ అక్షోభ్య అనే ల‌గ్జ‌రీ గేటెడ్ క‌మ్యూనిటీని పూర్తి చేసింది. దాదాపు రెండు ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో సుమారు 143 ఫ్లాట్లను డిజైన్ చేసింది. రెరా అనుమ‌తి గ‌ల ఈ ప్రాజెక్టు పూర్త‌య్యింది కాబ‌ట్టి.. ఇందులో ఫ్లాట్ల‌ను కొనేవారు జీఎస్టీ క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం రెండు ప‌డ‌క గ‌దుల ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయ‌ని సంస్థ చెబుతోంది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.6000గా సంస్థ నిర్ణ‌యించింది. ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఫ్లాటు కొనుగోలు చేసిన త‌ర్వాత‌.. ఇంటీరియ‌ర్స్ ప‌నుల్ని చేయించుకుని ఎంచ‌క్కా గృహ‌ప్ర‌వేశం చేసేయ‌వ‌చ్చు. ఇండిపెండెంట్ స్ట‌యిల్ త‌ర‌హాలో చేప‌ట్టిన ఈ ప్రాజెక్టులో కేవ‌లం కొన్ని ఫ్లాట్లే అందుబాటులో ఉన్నాయని గుర్తుంచుకోండి.

ఇదే సంస్థ సుచిత్రా సర్కిల్‌లో ఆర్‌వీ ఆద్విక్ అనే ప్రాజెక్టును పూర్తి చేసింది. సుమారు 1.93 ఎక‌రాల్లో 140 ఫ్లాట్ల‌ను నిర్మించింది. ప్ర‌స్తుతం కేవ‌లం టూ బెడ్రూమ్ ఫ్లాట్లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫ్లాట్ కొంటే జీఎస్టీ క‌ట్ట‌న‌క్క‌ర్లేదు. ధ‌ర కూడా చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5500 చెబుతున్నారు.

This website uses cookies.