ఓ గేటెడ్ కమ్యూనిటీలో.. లగ్జరీ అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్ట్‌లో క్రికెట్ గ్రౌండ్‌ని ఎవరైనా ఊహించగలరా..? దాన్ని సాధ్యం చేసి చూపించింది ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్. ఇలాంటి సర్ ప్రైజ్‌లు.. అన్ ఎక్స్‌పెక్టేడ్ కంఫర్ట్స్ చాలానే ఉన్నాయి ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియాలో. లష్ గ్రీనరీ, వరల్డ్ క్లాస్ క్లబ్‌హౌస్ లాంటి వసతులతో అల్రెడీ ఇక్కడ నివాసం ఉంటున్న వారు డ్రీమ్‌లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మరి అలాంటి ఐకానిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనే కోరిక మీకూ ఉందా..! అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొండాపూర్ ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియాని ఓ సారి విజిట్ చేయండి..! హైద్రాబాద్ ఆకాశహర్మ్యాల్లో ఒకటిగా పేరొందిన వినయ్ ఐకానియాలో ఉన్న ప్రత్యేకతలు.. రెజ్ న్యూస్ ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు రికమండేషన్ చేస్తుందో ఆ డీటైల్స్ ఓ సారి చూద్దాం.
ప్రాజెక్టు స్పెషాలిటీస్
- ప్రాజెక్ట్- ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా
- లొకేషన్- కొండాపూర్
- కంపెనీ- ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్
- టోటల్ ల్యాండ్ ఏరియా- 22 ఎకరాలు
- స్కై స్క్రేపర్ హైట్- 35 అంతస్థులు
- మొత్తం ఫ్లాట్స్- 2550
- యూనిట్ టైప్- 2, 3, 4 బీహెచ్‌కే
- యూనిట్ సైజ్- 1245-2925 చ.అ
- రెరా రిజిస్ట్రేషన్ నంబర్- P02400000069
P02400000195
సాధారణంగా మెజార్టీ కంపెనీలు- తాము నిర్మించే అపార్ట్‌మెంట్స్.. ఫ్లాట్స్‌ని కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టు డిజైన్ చేసి ఇస్తుంటాయ్. కానీ ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్స్‌లో మాత్రం కస్టమర్ల ఊహకు కూడా అందని ఫెసిలిటీస్‌ను నిర్వాహాకులు ముందుగానే సిద్ధం చేస్తారు. అందుకే ఎన్ని కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు ఉన్నా.. ఇంకెన్ని రియల్ ఎస్టేట్ సంస్థలున్నా.. ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ కన్‌స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇక హార్ట్ ఆఫ్ ద మోడ్రన్ హైద్రాబాద్‌గా ఉన్న కొండాపూర్‌లో.. 22 ఎకరాల వైశాల్యంలో ఎంతో విశాలంగా ఉంటుంది ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా.
యూనిటీ ఇన్ డైవర్శిటీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నిలుస్తున్న ఎస్‌ఎంఆర్ వినయ్ ఐకానియా ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ నిర్మిస్తున్న మరో అద్భుత సౌధం అనే చెప్పాలి. శివాలిక్, ఎవరెస్ట్, మౌంట్ బ్లాక్, జేడ్, రోసా, ఒలంపస్, క్రిస్టాల్లో, టిట్లిస్, స్టాన్లీ, లోగాన్, అన్నపూర్ణ, హామిల్టన్ అంటూ ప్రపంచంలోని ప్రముఖ ఎత్తైన పర్వతాల పేర్లనే ఐకానియాలో టవర్లకు పెట్టారు. జీహెచ్‌ఎంసీ అనుమతులు పొందిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం 11 టవర్లు.. ఒక్కో టవర్‌లో 35 అంతస్థులు.. ఓవరాల్‌గా 2550 అపార్ట్‌మెంట్ యూనిట్స్ ఉన్నాయ్.
2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే డైమెన్షన్‌లో వచ్చే ఈ ప్రీమియం లైఫ్‌స్టైల్ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌లో ప్రతీ ఫ్లాట్‌ను పక్కా వాస్తుతో నిర్మించారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్- ఇలా ఎవరికి ఏ ఫేసింగ్‌లో ఫ్లాట్ కావాలన్నా అందుబాటులో ఉన్నాయి వినయ్ ఐకానియాలో. ఇప్పటికే ఫ్లాట్ల పొసెషన్ కూడా స్టార్టైంది. దాదాపు 500కి పైగా కుటుంబాలు నివసించడమే కాదు ఫెస్టివల్స్ సహా అనేక ఈవెంట్స్‌ను కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ప్రశాంత జీవనం గడుపుతున్నారిక్కడ.
ఎస్ఎంఆర్ రికార్డు ఇదే..
ఒక రంగంలో స్థిరపడి దశాబ్ధాలుగా నంబర్ వన్‌గా రాణించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఎప్పుడు రైజ్ అవుతుందో.. ఎందుకు డౌన్‌ఫాల్ అవుతుందో అర్థంకాని అన్‌సర్టైనిటీ ఉండే రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో. ఇలాంటి అనిశ్చిత రంగంలోనూ నిశ్చింతగా సేవలందిస్తూ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్. థర్టీ ప్లస్ ఇయర్స్ ఎక్స్‌పీరియెన్స్‌తో రియాల్టీ అండ్ కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో అద్భుతాలు చేస్తోంది ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్. టాప్ క్వాలిటీ కన్‌స్ట్రక్షన్, సమయానికి డెలివరీ చేయడం, అఫర్డబుల్ ప్రైసెస్‌లోనే వరల్డ్ క్లాస్ హోమ్స్‌ను అందించాలనే సంకల్పం, కస్టమర్ల విశ్వాసం.. వారి అభిప్రాయాలకు విలువనిచ్చి.. వారి అంచనాలకు మించి పని చేయాలనే లక్ష్యంతో పని చేస్తుంది కనుకే మార్కెట్లో నంబర్ వన్‌గా ఉన్నామంటోంది ఎస్‌ఎంఆర్ యాజమాన్యం. 82కి పైగా ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసిన రికార్డ్.. 12 వేలకి పైగా హ్యాపీ ఫ్యామిలీస్ ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సొంతం.