poulomi avante poulomi avante

రెడీ టు ఆక్యుపై.. అండ‌ర్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌.. రెండింట్లో ఏ ఇల్లు కొంటే ఉత్త‌మం?

  • నిర్మాణ దశలో కొంటే అభిరుచికి త‌గ్గ‌ట్టు మార్చులు
  • నిర్మాణ దశలో ఇంటి ధర తక్కువ
  • నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంటి విలువ పెరుగుద‌ల‌
  • త్వ‌ర‌గా గృహ‌ప్ర‌వేశం.. త‌గ్గే ఇంటి అద్దె భారం

సొంతిల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు అంతా ఉవ్విళ్లూరుతుంటారు. కలల ఇంటి కోసం కష్టపడి పైసా పైసా కూడబెడతారు. అలా ఇళ్లు కొనేటప్పుడు ఎన్నో సందేహాలు. నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనాలా.. లేక అప్పటికే నిర్మాణం పూర్త‌యిన‌ ఇంటిని కొనుక్కోవాలా అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న. గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న ఇంటిని కొనడం వల్ల లాభనష్టాలేంటీ.. నిర్మాణంలో ఉన్న గృహాన్ని కొనడంతో కలిగే ప్రయోజనాలేంటీ.. రియల్ రంగ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

సొంతిల్లు అందరి కల. సామాన్యుడి నుంచి మొదలు ధనవంతుల వరకు తమ కలల సౌధమైన సొంతింటిని తమ బడ్జెట్ మేరకు.. వారి అభిరుచి ప్రకారం ఉండాలని అనుకుంటారు. సామాన్య, మధ్యతరగతి వారైతే.. దాదాపు జీవితంలో ఒక్కసారి మాత్రమే సొంతం చేసుకునే సొంతింటి విషయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తమకు అందుబాటు ధరలో, నచ్చిన ప్రాంతంలో ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సొంతిల్లు తీసుకునే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయాలా.. లేక అప్పటికే నిర్మాణం పూర్త‌యిన‌ ఇంటిని కొనుక్కోవాలా.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులకు ఏది అనుకూలం అన్నది చాలా మందిలో మెదిలే ప్రశ్న.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిర్మాణ రంగం మంచి జోరుమీద ఉంది. హైదరాబాద్, విజయవాడతో పాటు రెండు రాష్ట్రాల్లోని అన్ని పట్టణాల్లో కొన్ని వేల కొత్త ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన ఇంటిని, తమకు కావాల్సిన దశలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇంటిని కొనడం వల్ల కొన్ని ప్రయోజనాలను పొందవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సమయంలో ఇంటిని కొంటే నచ్చిన ఫ్లోర్, మనకిష్టమైన దిక్కుకు ఉంటేలా ఎంచుకోవచ్చు. ఇక నిర్మాణ దశలో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా.. ఇంటి ధర కూడా కొంత మేర తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ప్రారంభ ద‌శలో అయితే, ఇంటిని తమకు కావాల్సిన రీతిలో కట్టించుకోవచ్చు. నిర్మాణ సమయంలో మాత్రమే ఇటువంటి సౌలభ్యం ఉంటుంది.
నిర్మాణ సమయంలో ఇంటిని కొనడం వల్ల అది పూర్తయ్యేసరికి కనీసం యేడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఆ సమయంలో ఇంటి ధర సుమారు 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుంది. అంటే ఇంట్లోకి వెళ్లక ముందే.. మన స్థిరాస్థి విలువ పెరుగుతుందన్నమాట. అయితే నిర్మాణ సమయంలో ఇంటిని కొనుగోలు చేయడం వల్ల బిల్డర్ గడువు లోపు ఇంటిని పూర్తి చేస్తాడా అన్న సమస్య ఉంటుంది. అంతే కాదు నిర్మాణ సమయం నుంచే హౌజ్ లోన్ కోసం నెలవారి వాయిదాలు చెల్లించాల్సి ఉండటం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇక నిర్మాణం పూర్త‌యిన‌ ఇంటిని కొనుగోలు చేయడం ద్వార కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయని రియల్ రంగ సంస్థలు చెబుతున్నాయి. అందులో ప్రధానంగా ఇంటిని కొన్న వెంటనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇంటి కోసం ఏ మాత్రం ఎదురు చూడాల్సిన పని లేదు. అంతే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణం పూర్త‌య్యి సిద్ధంగా ఉన్నగృహాల ధరలే తక్కువగా ఉన్నాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. సిమెంట్, స్టీల్ వంటి ముడిసరకుల ధరల పెరుగుదల దృష్ట్యా.. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువ ధరలు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నిర్మాణం పూర్త‌య్యి గృహప్రవేశానికి సిద్దంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయడం వల్ల ఒకేసారి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి గురించి ఆలోచించాలి. మరోవైపు ఇంటిని మన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకోవాలంటే అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే వీటన్నింటిని బేరీజు వేసుకుని, నిర్మాణ సంస్థను బట్టి నిర్మాణంలో ఉన్న ఇంటిని, లేదంటే తమ బడ్జెట్ కు సరిపోయి, కోరుకున్న విధంగా ఉంటే నిర్మాణం పూర్త‌యిన గృహాన్ని కొనుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles