అపార్ట్ మెంట్ల అప్పగింతలో జాప్యం తదితర కారణాలతో ఇళ్ల కొనుగోలుదారులకు చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి మహారాష్ట్ర రెరా బిల్డర్ల నుంచి రూ.133.56 కోట్లు రికవరీ చేసింది. మొత్తం రూ.627.70 కోట్ల రికవరీకి సంబంధించి 1053 వారెంట్లను మహా రెరా జారీ చేసింది. ఆయా మొత్తాలను చెల్లించకుంటే బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తామని హెచ్చరించింది. అనంతరం 190 మంది డెవలపర్ల నుంచి రూ.133.56 కోట్లు రికవరీ చేసింది. దేశంలోని ఏ రాష్ట్ర రెరాతో పోల్చినా ఇది అత్యంత ఎక్కువ రికవరీ మొత్తం కావడం విశేషం. నాగ్ పూర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ నుంచి అత్యధికంగా రూ.4.71 కోట్లు వసూలు చేసింది.