Categories: TOP STORIES

హైదరాబాద్ లో తగ్గిన రిజిస్ట్రేషన్లు

హైదరాబాద్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గత నెలలో రూ.2,198 కోట్ల విలువ చేసే 4,307 రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు రూ.25,094 కోట్ల విలువైన 50,953 రిజిస్ట్రేషన్ లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలావధిలో రూ.27,640 కోట్ల విలువైన 62,052 లావాదేవీల కంటే ఇది తక్కువ. ఇక గతనెల అమ్మకాల్లో రూ.25-50 లక్షల ధర కలిగిన రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాల వాటా 55 శాతంగా ఉంది. గతేడాది సెప్టెంబర్ లో 39 శాతమే కావడం గమనార్హం. రూ.25 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు గతేడాది సెప్టెంబర్ లో 39 శాతం ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ లో 16 శాతానికి తగ్గింది. అదే రూ.50 లక్షలకు పైబడిన గృహాల అమ్మకాలు గతేడాది సెప్టెంబర్ లో 25 శాతం ఉండగా.. తాజాగా 28 శాతానికి పెరిగింది. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న యూనిట్ల విక్రయాలు మొత్తం అమ్మకాల్లో 81 శాతం ఉన్నాయి. కరోనా అనంతరం చాలామంది పెద్ద గృహాల వైపు మొగ్గు చూపుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది.

This website uses cookies.