Categories: LATEST UPDATES

బెంగాల్ లో స్టాంప్ డ్యూటీ తగ్గింపు

కొత్త ఇల్లు కొనుగోలుదారులకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. స్టాంప్ డ్యూటీలో 2 శాతం మినహాయింపుతోపాటు సర్కిల్ రేట్లలో 10 శాతం తగ్గింపును మరో రెండు నెలలపాటు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ లో ప్రకటించిన రాయితీల మేరకు ఈ రెండూ అక్టోబర్ 30 వరకు అమలు చేయాల్సి ఉంది. అయితే, మరో రెండు నెలలపాటు.. అంటే డిసెంబర్ 31 వరకు ఈ రాయితీలను పొడిగిస్తూ మమత తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ రాయితీలు ప్రకటించడం వల్ల జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 75 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మినహాయింపును పొందేందుకు పలువురు కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఈ మినహాయింపులను మరికొంతకాలం పొడిగించాలని క్రెడాయ్ వెస్ట్ బెంగాల్.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరింది. దీంతో ఆమె ఈ మినహాయింపులను మరో రెండు నెలలపాటు పొడిగించారు. కాగా, సీఎం తీసుకున్న నిర్ణయంపై క్రెడాయ్ వెస్ట్ బెంగాల్ అధ్యక్షుడు సుశీల్ మొహతా హర్షం వ్యక్తంచేశారు. దీనివల్ల అటు రాష్ట్రానికి ఆదాయం రావడంతో పాటు ఇళ్ల కొనుగోలుదారులకు భారీ ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

This website uses cookies.