తెలంగాణ రాష్ట్రంలో అపార్టుమెంట్ల నిర్వాహణ సంఘం రిజిస్ట్రేషన్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని ప్రభుత్వం తొలగించింది. ఇక నుంచి తెలంగాణలోని అపార్టుమెంట్ల నివాసితుల సంఘాన్ని స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ నమోదు చేస్తుంది. ఈ మేరకు సోమవారం తెలంగాణ రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వ్యులు జారీ చేశారు. దీంతో, గత కొంతకాలం నుంచి గేటెడ్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్లలో నెలకొన్న అయోమయానికి తెరపడిందని చెప్పొచ్చు. ఈ సమస్యను రెవెన్యు శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ దృష్టికి నగరానికి చెందిన నివాసితుల సంఘాల సమాఖ్య తీసుకెళ్లింది. ఈ అంశానికి సంబంధించి ఆయన సానుకూలంగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపెట్టారు.
* 2019లో హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్.. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ల ఏజీఎం నివేదిక, ఖాతాలు మరియు ఇతర అప్‌డేట్‌లను ఆమోదించవద్దని జిల్లా రిజిస్ట్రార్‌కు సర్క్యులర్ జారీ చేశారు. అప్పట్నుంచి తెలంగాణలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ అసోసియేషన్లను రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లుగా నమోదు చేసుకున్న వారి ఏజీఎం, ఖాతాల పుస్తకాలను నవీకరించలేకపోయాయి. నివాసితుల సంఘాలు కూడా తమ బ్యాంక్ ఖాతాను ఆపరేట్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అపార్టుమెంట్ల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగుమం అవుతుంది. “2013కి ముందు రిజిస్టర్ చేసుకున్న అన్ని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు ఇది శుభవార్త అని.. ఈ విషయంలో మాకు సహాయం చేసినందుకు మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలని నగరానికి చెందిన యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాసన్ రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.
This website uses cookies.