మైత్రి అంబుజా (సంఘీ అంబుజా) ప్రాజెక్ట్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా, రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా కోహెడ గ్రామం, అబ్దుల్లాపూర్ మేట్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ప్రీలాంచ్ ప్రాజెక్టు చేపట్టినందున రెరా అథారిటీ దృష్టికి వచ్చినట్లు రెరా కార్యదర్శి ఎస్. బాలకృష్ణ తెలిపారు. ఈ కారణంగా మైత్రి అంబుజా ప్రాజెక్టుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సంజాయిషి వచ్చిన తర్వాత విచారణ జరిపి.. రెరా చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రెరా అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుందనే విషయం దీని ద్వారా అర్థమైంది. కాకపోతే, ఇలాంటి చిన్న సంస్థలపై దృష్టి సారించడం కంటే.. బడా బాబులను పట్టుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని సంస్థలని పట్టుకోవడంతో బాటు మార్కెట్లో ప్రీలాంచ్ ప్రాజెక్టుల్ని చేస్తున్న పేరున్న సంస్థల్ని పట్టుకోవడంపై దృష్టి సారించాలి.
This website uses cookies.