Categories: TOP STORIES

రెజ్ న్యూస్ క‌థ‌నానికి స్పంద‌న‌.. బిల్డాక్స్ సంస్థ‌కు టీఎస్ రెరా నోటీసు

* రెజ్ న్యూస్ క‌థ‌నానికి స్పంద‌న‌

బిల్డాక్స్ సంస్థ‌పై రెజ్ న్యూస్ రాసిన క‌థ‌నంపై తెలంగాణ రెరా అథారిటీ స్పందించింది. ప్రీలాంచ్ కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న బిల్డాక్స్‌కు తాజాగా నోటీసును జారీ చేసింది. గ‌త అక్టోబ‌రులో రెజ్ న్యూస్‌లో వ‌చ్చిన క‌థ‌నం ఆధారంగా అప్ప‌ట్లో షోకాజ్ నోటీసును జారీ చేశామ‌ని రెరా అథారిటీ తాజాగా వెల్ల‌డించింది. అయితే, బిల్డాక్స్ ఇచ్చిన సంజాయిషీ సంతృప్తిక‌రంగా లేద‌ని గుర్తించి.. తాజాగా మ‌రోసారి నోటీసును మంగ‌ళ‌వారం జారీ చేసిన‌ట్లు.. రెరా స‌భ్య కార్య‌ద‌ర్శి పి. యాదిరెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప‌దిహేను రోజుల్లోపు సంజాయిషీని అంద‌జేయాల‌ని ఆయ‌న ఆదేశించారు.

* ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని జింకల తoడాలో జీఆర్ఆర్‌ విశ్రాంతి రిసార్ట్స్.. `రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండానే.. వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయ‌డాన్ని గుర్తించి.. రెరా అథారిటీ నోటీసును జారీ చేసింది. కూసుమంచిలోని జీల చెరువు గ్రామంలోనీ జీఆర్ఆర్‌ హైవే కౌంటీ ప్రాజెక్టు, ఇండో క్వటార్ ప్రాజెక్టుల‌కు సంబంధించి నోటీసును జారీ చేశారు. అబ్దుల్లాపూర్ మండలం అంబర్ పేట మున్సిపాలిటీలోని తట్టి అన్నారంలో రెరా అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపడుతున్న అనంత వనస్థలి హిల్స్ కు రెరా షోకాజు నోటీసును జారీ చేసింది. రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా హైదరాబాద్లో పలు ప్రాజెక్టుల వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్ని జారీ చేస్తున్న గో గ్రీన్ గ్రూప్ ప్రాజెక్టుకు నోటీసునిచ్చారు.

* రెరా రిజిస్ట్రేషన్ లేకుండా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రకటనలు జారీచేయడం, మార్కెటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ‘రెరా’ చట్ట ప్రకారం నిషేదమని, నిబంధనలు ఉల్లంగించిన ప్రాజెక్టులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, ఇత‌ర స్థానిక సంస్థ‌ల నుంచి ప‌ర్మిష‌న్‌తో పాటు రెరా నుంచి అనుమ‌తి తీసుకున్నాకే ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయాల‌ని.. ఫ్లాట్ల‌ను విక్ర‌యించాల‌ని.. లేక‌పోతే, రెరా చ‌ట్టం ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని తెలిపారు.

This website uses cookies.