సమాజంలో జరిగే వాస్తవ పరిస్థితుల్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీఎస్ న్యూస్ ప్రథమ స్థానంలో ఉండాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆకాంక్షించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో టీఎస్ న్యూస్, రెజ్ టీవీ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో ప్రజలకు శుభం జరగాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ న్యూస్ ఎండీ కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల కారణంగా.. కొత్త ఏడాదిలో రియాల్టీ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో దాదాపు నలభై వేల ఫ్లాట్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు. ఈ సంఖ్య 2025లో మరింత పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా.. పేరెన్నికల పన్నెండు నిర్మాణ సంస్థలను ఒక తాటిపైకి తీసుకొచ్చి.. 2025 క్యాలెండర్‌ను రూపొందించామని తెలిపారు. సినీ దర్శకుడు శ్రీనాగ్ మాట్లాడుతూ యావే మీడియా రూపొందించిన క్యాలెండర్ ఆకర్షణీయంగా ఉందన్నారు. కార్యక్రమంలో యాంకర్ లహరిక, సంజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.